PhonePe: ఫోన్‌పే ఐపీఓకు సెబీ ఆమోదం

by S Gopi |

చాలా కాలంగా మదుపర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పబ్లిక్ ఆఫర్‌కు తాజాగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం ఇచ్చింది.

PhonePe: ఫోన్‌పే ఐపీఓకు సెబీ ఆమోదం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్, వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫోన్ పే ఐపీఓకు సిద్ధమవుతోంది. చాలా కాలంగా మదుపర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పబ్లిక్ ఆఫర్‌కు తాజాగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం ఇచ్చింది. సెబీ సూచనల ఆధారంగా మార్పులు చేసిన కొత్త డీహెచ్ఆర్‌పీని త్వరలో సెబీకి సమర్పిస్తామని ఫోన్‌పే వెల్లడించింది. పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ రూపంలో జరిగే ఈ పబ్లిక్ ఆఫరింగ్‌లో భాగంగా వాల్‌మార్ట్, మైక్రోసాఫ్ట్, టైగర్ గ్లోబల్ తమ వాటాలలో కొంత భాగాన్ని విక్రయించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ పద్ధతిలో ఇప్పటికే వాటాదారులుగా ఉన్న వారి వాటా షేర్లను విక్రయించడం. ఇందులో కొత్త షేర్ల జారీ ఉండదు. దీనివల్ల కంపెనీకి ఐపీఓ ద్వారా ఎటువంటి నిధులు అందవు. 2015లో ఏర్పాటైన ఫోన్‌పే, ప్రముఖ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ)లో అగ్రగామి చెల్లింపుల ప్లాట్‌ఫామ్‌గా ఉంది. గతేడాది డిసెంబర్ నాటికి లావాదేవీల ప్రకారం కంపెనీకి 45 శాతానికి పైగా మార్కెట్ వాటా ఉంది. గత నెలలో ఫోన్‌పే మొత్తం 980 కోట్లకు పైగా లావాదేవీలను ప్రాసెస్ చేసింది. ఇక, ఫోన్‌పే ఐపీఓకు సంబంధించి ఎంత మొత్తానికి పబ్లిక్ ఆఫర్ ఉంటుంది, షేర్ ధరల వివరాలను కంపెనీ త్వరలో వెల్లడిస్తుంది.

Next Story