రూ.1 పేమెంట్ చేస్తే రూ.144 పక్కా క్యాష్ బ్యాక్.. ఫోన్ పే క్రేజీ ఆఫర్

by Yella Dhawani Reddy |

ప్రస్తుతం దేశంలో డిజిటల్‌ లావాదేవీలు బాగా పెరిగిపోయాయి.

రూ.1 పేమెంట్ చేస్తే రూ.144 పక్కా క్యాష్ బ్యాక్.. ఫోన్ పే క్రేజీ ఆఫర్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం దేశంలో డిజిటల్‌ లావాదేవీలు బాగా పెరిగిపోయాయి. ఈక్రమంలో ఆయా పేమెంట్స్ యాప్స్ యూజర్లను ఆకట్టుకునేందుకు వివిధ రకాల ఆఫర్స్ ఇస్తూనే ఉన్నాయి. తాజాగా వినియోగదారుల కోసం ఫోన్ పే యాప్ క్రేజీ ఆఫర్ ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో మహా కుంభమేళా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా 'హ్యాపీ మహాకుంభ్, మహాశగున్' పేరుతో ఈ ఆఫర్‌ను అందిస్తుంది.

ఈ ఆఫర్ ప్రకారం యూపీలోని ప్రయాగ్‌రాజ్‌ నగరంలో ఫోన్‌పే ఉపయోగించే కస్టమర్లు మొదటి ట్రాన్సక్షన్స్‌పై రూ.144 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. కేవలం రూ.1 పేమెంట్ చేసి కూడా వినియోగదారులు రూ.144 క్యాష్ బ్యాక్ పొందవచ్చు. అయితే ఈ ఆఫర్ కేవలం ఫిబ్రవరి 26 వరకే అందుబాటులో ఉంటుంది. అది కూడా ప్రయాగ్‌రాజ్‌ నగరంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఇతర ప్రాంతాల వారికీ ఈ ఆఫర్‌ లభించదు.

ఈ ప్రత్యేక క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ఉపయోగించేందుకు, వినియోగదారులు ముందుగా ఫోన్‌పే యాప్‌ను iOS లేదా Android పరికరాల్లో డౌన్‌లోడ్ చేసుకుని, బ్యాంక్ ఖాతాను లింక్ చేసుకుని UPI పిన్ సెట్ చేయాలి. ఫోన్‌పే యాప్‌లో లొకేషన్ అనుమతిని కూడా ఇవ్వాల్సి ఉంటుంది.

Next Story