Petrol Diesel Price: అదిరిపోయే గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు

by Vennela |

Petrol Diesel Price Drop: వాహనదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్.

Petrol Diesel Price: అదిరిపోయే గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
X

దిశ, వెబ్ డెస్క్:Petrol Diesel Price Drop: వాహనదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్. త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గున్నాయి. ఈ విషయం స్వయంగా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి తెలిపారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిన సంగతి తెలిసిందే. ఈ భారాన్ని ఆయా కంపెనీలే భరించేలా ప్లాన్ చేసింది. అయితే ఇప్పుడు కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలతో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే మార్గాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ముడి చమురు ధరల తగ్గింపు వల్ల భారత్ ప్రయోజనం పొందుతుందని దేశంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు ధరలను తగ్గించే స్థితిలో ఉన్నాయని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ తెలిపారు.

భారత్ 40 దేశాల నుంచి చమురు కొనుగోలు చేస్తోందని పెట్రోలియం, సహజవాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ప్రస్తుత ముడి చమురు ధరలు స్థిరంగా ఉంటే ఓఎంసీలు ఇంధన ధరలను తగ్గించే సామర్థ్యంతో ఉంటాయన్నారు. బీజేపీ పాలిత, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల మధ్య ధరల్లో లీటరుకు రూ. 10-12 తేడా ఉంటుందని కూడా గమనించాల్సిన విషయం ఉందన్నారు. భారత్ లోఎల్పీజీ కనెక్షన్లను గణనీయంగా పెరిగాయని,2014లో 14కోట్లుగా ఉండగా ప్రస్తుతం 31కోట్లకు పెరిగాయని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ తెలిపారు.

భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత చౌకైన వంట గ్యాస్ ను అందిస్తోందన్నారు. ఉజ్వల స్కీము కింద ఎల్పీజీ రోజుకు కేవలం రూ. 5మాత్రమే, ఉజ్వల వినియోగదారులకు కాని వారికి రోజుకు రూ. 14మాత్రమే తీసుకుంటున్నామన్నారు. దీంతో FY25లో చమురు మార్కెటింగ్ కంపెనీలకు ఎల్పీజీపై రూ. 41, 338 కోట్ల భారీ నష్టం వాటిల్లిందని తెలిపారు. దీన్ని భర్తీ చేసేందుకు ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది.

Next Story