- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Chrome: గూగుల్ 'క్రోమ్ బ్రౌజర్' కొనేందుకు భారీ ఆఫర్ ఇచ్చిన పర్‌ప్లెక్సిటీ ఏఐ
ఈ మొత్తం పర్‌ప్లెక్సిటీ ప్రస్తుత విలువ కంటే చాలా ఎక్కువ.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ పర్‌ప్లెక్సిటీ ఏఐ బ్రౌజింగ్ దిగ్గజం గూగుల్‌కు చెందిన క్రోమ్‌ను కొనేందుకు భారీ ఆఫర్ చేసింది. క్రోమ్ బ్రౌజర్ కోసం ఏఐ కంపెనీ ఏకంగా 34.5 బిలియన్ డాలర్లు(మన కరెన్సీలో రూ. 3.02 లక్షల కోట్లు) బిడ్‌ను దాఖలు చేసిందని ది వాల్ స్ట్రీట్ జర్నల్, రాయిటర్స్ వంటి పత్రికలు మంగళవారం ధృవీకరించాయి. అయితే, ఈ మొత్తం పర్‌ప్లెక్సిటీ ప్రస్తుత విలువ కంటే చాలా ఎక్కువ. కానీ చాలామంది పెట్టుబడిదారులు ఈ ఒప్పందానికి మద్దతు ఇవ్వడానికి అంగీకరించారని కంపెనీ తెలిపింది. ఈ ఏడాది జూలైలో పర్‌ప్లెక్సిటీ విలువను 18 బిలియన్ డాలర్లుగా నిర్ణయించారు. పర్‌ప్లెక్సిటీ కంపెనీ ఏఐ-ఆధారిత సెర్చ్ ఇంజిన్‌కు ప్రసిద్ధి చెందింది. ఇది యూజర్లు అడిగే ఎలాంటి ప్రశ్నలకైనా సరళంగ సమాధానాలను ఇవ్వడంతో పాటు వెబ్‌లోని అసలు సోర్స్ మెటీరియల్‌కు లింక్‌లను అందిస్తుంది. గత నెలలోనే ఈ కంపెనీ కామెట్ అనే తన స్వంత ఏఐ-ఆధారిత బ్రౌజర్‌ను ప్రారంభించింది. అయితే, ఈ స్టార్టప్ జనరేటివ్ ఏఐలో ఆధిపత్యం కోసం పోరాడుతోంది. మెటా,ఓపెన్ఏఐ లాంటి కంపెనీలు స్కిల్స్ ఉన్న ఇంజనీర్లకు భారీ జీతాలు, బోనస్‌లను ఇచ్చి మరీ కొత్త టెక్నాలజీపై పనిచేస్తున్నాయి. ఈ మెగా టెక్ కంపెనీలు ఏఐ మౌలిక సదుపాయాలపై ఏటా 10 బిలియన్ల డాలర్లను ఖర్చు చేస్తున్నాయి. గతేడాది నుంచి గూగుల్‌పై కొనసాగుతున్న యాంటీట్రస్ట్ తనిఖీల నేపథ్యంలో క్రోమ్‌ను విక్రయించాలని యుఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్(డీఓజే) ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.






