- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తొలిసారి లాభాల్లోకి అడుగుపెట్టిన పేటీఎం
విజయ్ శేఖర్ శర్మ నేతృత్వంలోని ప్రముఖ డిజిటల్ ఫైనాన్స్ సంస్థ పేటీఎం (One97 Communications Ltd) భారీగా నష్టాలు చూసిన ఎన్నో క్వార్టర్ల తరువాత చివరకు లాభాల్లోకి అడుగుపెట్టింది.

దిశ, వెబ్‌డెస్క్: విజయ్ శేఖర్ శర్మ నేతృత్వంలోని ప్రముఖ డిజిటల్ ఫైనాన్స్ సంస్థ పేటీఎం (One97 Communications Ltd) భారీగా నష్టాలు చూసిన ఎన్నో క్వార్టర్ల తరువాత చివరకు లాభాల్లోకి అడుగుపెట్టింది. 2024-25 ఆర్థిక సంవత్సరం ఫస్ట్ క్వార్టర్ (ఏప్రిల్-జూన్)లో సంస్థ రూ.122.5 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఇదే క్వార్టర్ సమయంలో గతేడాది కంపెనీ రూ.838.9 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. అంతకు ముందు క్వార్టర్లోనూ రూ.539.8 కోట్ల నష్టం ఎదుర్కొంది. తాజా ఫలితాలతో పేటీఎం ఆర్థికంగా పుంజుకున్నట్లు కనిపిస్తోంది.
తాజా క్వార్టర్లో పేటీఎం (Paytm) ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. గతేడాది ఇదే సమయంలో రూ.1501.6 కోట్లుగా ఉన్న ఆదాయం.. ఈసారి 28% వృద్ధితో రూ.1917.5 కోట్లకు చేరింది. ఫలితాల ప్రభావంతో, కంపెనీ షేరు ధర 3.48% పెరిగి రూ.1053.10 వద్ద ట్రేడింగ్ ముగించింది. ఆదాయ వృద్ధికి ప్రధానంగా వ్యాపారుల నుంచి పెరిగిన సబ్‌స్క్రిప్షన్‌లు, ఫైనాన్షియల్ సర్వీసుల పంపిణీ విస్తరణ కీలక పాత్ర పోషించాయి. ఈ త్రైమాసికంలో పేటీఎంకు 8 లక్షల కొత్త సబ్‌స్క్రైబర్లు చేరగా, మొత్తం సబ్‌స్క్రైబర్ బేస్ రూ.1.24 కోట్లకు చేరింది. ఫైనాన్షియల్ సర్వీసుల ద్వారా వచ్చిన ఆదాయం రూ.545 కోట్లను తాకింది.






