- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Paytm: ఏఐతో పనిచేసే ట్రావెల్ యాప్‌ను విడుదల చేసిన పేటీఎం
ఈ యాప్ ద్వారా వినియోగదారులు విమానాలు, రైళ్లు, బస్సులు, మెట్రో టికెట్లను సులభంగా బుక్ చేసుకోవచ్చు

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ పేటీఎం కొత్తగా ఏఐ-ఆధారిత ట్రావెల్ బుకిన్ యాప్‌ను విడుదల చేసింది. 'పేటీఎం చెక్-ఇన్' పేరుతో తీసుకొచ్చిన ఈ యాప్ ద్వారా వినియోగదారులు విమానాలు, రైళ్లు, బస్సులు, మెట్రో టికెట్లను సులభంగా బుక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ యాప్ ద్వారా ఎక్కడికైనా ప్రయాణించాలంట్ డెస్టినేషన్ రికమెండేషన్లు ఇస్తుంది. అలాగే వ్యక్తిగత యాత్రలకు ప్రణాళికలు రూపొందించవచ్చు, బుకింగ్ మేనేజ్‌మెంట్ లాంటి సదుపాయాలు కూడా లభిస్తాయి. ఏఐ ఆధారిత ట్రావెల్ రంగంలో 'పేటీఎం చెక్-ఇన్' కీలక మైలురాయిగా నిలుస్తుందని పేటీఎం ట్రావెల్ సీఈఓ వికాస్ జలాన్ చెప్పారు. ప్రజలు మరింత అత్యాధునికంగా, స్మార్ట్‌గా ప్రయాణాలకు సిద్ధమవొచ్చు. వ్యక్తిగతంగా, సులభంగా ప్రయాణాలు చేసేందుకు ఈ యాప్ సహకరిస్తుందని, ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్‌తో పాటు ఐఓఎస్ యాప్ స్టోర్‌లోనూ అందుబాటులో ఉందని ఆయన వెల్లడించారు.
కొత్త పేటీఎం ట్రావెల్ యాప్‌లో ఏఐ ఎలా పనిచేస్తుందంటే..
ఈ యాప్‌లో కృత్రిమ మేధస్సు (ఏఐ) అసిస్టెంట్ ఉంటుంది. దీన్ని ఉపయోగించి వినియోగదారులు కన్వర్సేషనల్ ఇంటర్‌ఫేస్ ద్వారా ప్రయాణానికి సంబంధించి బ్రౌజ్ చేయడానికి, టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ ఏఐ అసిస్టెంట్ డెస్టినేషన్స్‌ను కూడా సిఫార్సు చేస్తుంది. పేటీఎం చెక్-ఇన్ ఏఐను ఉపయోగించి వినియోగదారుల గతంలో ఎంపిక చేసిన, ప్రయాణ ధోరణులకు అనుగుణంగా రిజల్ట్స్ అందిస్తుంది కంపెనీ పేర్కొంది.






