- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Paytm: 4,600 ఉద్యోగులను తొలగించిన పేటీఎం
సిబ్బంది తగ్గించే ఈ నిర్ణయం కారణంగా కంపెనీ రూ. 651 కోట్ల వరకు ఖర్చులను తగ్గించేందుకు వీలైంది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 4,600 మంది ఉద్యోగులను తొలగించినట్టు ప్రకటించింది. గురువారం కంపెనీ విడుదల చేసిన తన వార్షిక నివేదిక ప్రకారం, 2023-24లో కంపెనీలో మొత్తం 43,960 మంది ఉద్యోగులు ఉన్నాయని, 2024-25 నాటికి ఇది 39,368కి తగ్గించినట్టు పేర్కొంది. సంస్థను మరింత లాభదాయకంగా, చురుగ్గా కార్యకలాపాలు నిర్వహించే వ్యూహాత్మక ప్రయత్నంలో భాగంగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించినట్టు కంపెనీ వివరణ ఇచ్చింది. సిబ్బంది తగ్గించే ఈ నిర్ణయం కారణంగా కంపెనీ రూ. 651 కోట్ల వరకు ఖర్చులను తగ్గించేందుకు వీలైంది. ఈ అంశంపై పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈఓ విజయ్ శేఖర్ శర్మ మాట్లాడుతూ.. పెట్టుబడుల ఉపసంహరణ, వ్యాపారాల తగ్గింపు వంటి కఠిన నిర్ణయాల వల్లనే ఉద్యోగుల సంఖ్యను తగ్గించాం. కంపెనీ ఖర్చులను తగ్గించుకుంటూనే, కొత్త అవకాశాల్లో పెట్టుబడుల కోసం కృషి చేస్తున్నట్టు వాటాదారులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. మొత్తం ఉద్యోగల సంఖ్యను తగ్గించినప్పటికీ, పేటీఎం తన నెట్‌వర్క్‌ను విస్తరించడానికి ఇప్పటికీ తన సేల్స్ విభాగంలో పెట్టుబడులను కొనసాగిస్తోందని శర్మ వెల్లడించారు.






