Patanjali Foods: ఎంఆర్‌పీ ధరలు తగ్గించిన పతంజలి ఫుడ్స్

by S Gopi |

సవరించిన ధరలు ఆహారం, ఆహారేతర ఉత్పత్తులన్నిటికీ వర్తిస్తాయి.

Patanjali Foods: ఎంఆర్‌పీ ధరలు తగ్గించిన పతంజలి ఫుడ్స్
X

దిశ, బిజినెస్ బ్యూరో: పతంజలి గ్రూపునకు చెందిన పతంజలి ఫుడ్స్‌ జీఎస్టీ సంస్కరణల ప్రయోజనాలను కస్టమర్లకు అందించేందుకు తన పోర్ట్‌ఫోలియోలోని అన్ని రకాల ఉత్పత్తుల ధరలు తగ్గించినట్టు వెల్లడించింది. ఈ మేరకు ఆదివారం ధరల తగ్గింపునకు సంబంధించి ప్రకటన జారీ చేసింది. సోమవారం నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయని, జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను పూర్తిస్థాయిలో వినియోగదారులకు అందిస్తామని కంపెనీ తెలిపింది. సవరించిన ధరలు ఆహారం, ఆహారేతర ఉత్పత్తులన్నిటికీ వర్తిస్తాయి. అందులో భాగంగా పతంజలి ఫుడ్స్ న్యూట్రెలా బ్రాండ్‌లో సోయా ఉత్పత్తుల ధరలను తగ్గించింది. బిస్కెట్లు, కుకీల విభాగంలో దూద్ బిస్కెట్ (35 గ్రా) ధరను రూ.5 నుంచి రూ.4.5కి తగ్గించింది. నూడుల్స్‌లో పతంజలి ట్విస్టీ టేస్టీ నూడుల్స్ (50 గ్రా) ఇప్పుడు రూ.10కి బదులుగా రూ. 9.35కి లభిస్తుంది. పతంజలి ఫుడ్స్ ఓరల్ కేర్, హెయిర్ కేర్ (దంత్ కాంతి రేంజ్) రేట్లను కూడా తగ్గించింది. దంత్ కాంతి నేచురల్ టూత్‌పేస్ట్ 200 గ్రాముల ధర 120 రూపాయల నుంచి రూ. 106కి, కేష్ కాంతి ఆమ్లా హెయిర్ ఆయిల్ (100ఎంఎల్) రిటైల్ ధరలు రూ.48 నుంచి రూ.42కు తగ్గుతాయి. అదేవిధంగా, ఆరోగ్యం, వెల్నెస్ ఉత్పత్తులలో ఆమ్లా జ్యూస్ (1000 ఎంఎల్) రూ.140కి లభిస్తుంది. స్పెషల్ చ్యవన్‌ప్రాష్ కిలో ప్యాక్ ధర రూ.337కే అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం దీని ధర రూ.360 ఉంది. పాల ఉత్పత్తులలో పతంజలి ఆవు నెయ్యి (900 ఎంఎల్) ధరను రూ.780 నుంచి రూ.732కి తగ్గించింది.

Next Story