Vehicle Sales: వాహన అమ్మకాల్లో రికార్డు

by S Gopi |

జనవరిలో కార్ల తయారీ కంపెనీలు దేశవ్యాప్తంగా ఫ్యాక్టరీల నుంచి డీలర్లకు దాదాపు 4.5 లక్షల వాహనాలను పంపాయి.

Vehicle  Sales: వాహన అమ్మకాల్లో రికార్డు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది మొదటి నెలలో దేశ ప్యాసింజర్ వాహన కంపెనీలకు లాభాల పంట పండింది. ఈ ఏడాది మెరుగైన అమ్మకాలతో ప్రారంభించింది. జనవరిలో కార్ల తయారీ కంపెనీలు దేశవ్యాప్తంగా ఫ్యాక్టరీల నుంచి డీలర్లకు దాదాపు 4.5 లక్షల వాహనాలను పంపాయి. ఇది గతేడాది కంటే దాదాపు 12.6 శాతం ఎక్కువ. ఈ వృద్ధికి ప్రధాన కారణాలలో ఒకటి ఎస్‌యూవీలకు అధిక గిరాకీ ఉండటమేనని నిపుణులు అంటున్నారు. దీనికి తోడు ఇటీవలి జీఎస్టీ సంస్కరణలు, డీలర్‌షిప్‌లలో తక్కువ ఇన్వెంటరీలతో ఈ రికార్డు స్థాయి టోకు విక్రయాలు నమోదయ్యాయని నిపుణులు వెల్లడించారు. సమీక్షించిన నెలలో అత్యధికంగా మారుతీ సుజుకి ఇండియా 2,36,963 యూనిట్ల(12 శాతం వృద్ధి) టోకు అమ్మకాలను నమోదు చేసింది. ఇది ఇప్పటివరకు ఒక నెలలో నమోదైన అత్యధిక అమ్మకాల సంఖ్య అని కంపెనీ వెల్లడించింది. దీని తర్వాత టాటా మోటార్స్ 70,222 యూనిట్లతో(46.1 శాతం వృద్ధి), 63,510 యూనిట్లతో 25.4 శాతం ఎక్కువ అమ్మకాలను ఎంఅండ్ఎం, 59,107 యూనిట్లతో 9.5 శాతం ఎక్కువగా హ్యూండాయ్ మోటార్స్, 17 శాతం ఎక్కువగా 30,630 యూనిట్లతో టొయొటా కిర్లోస్కర్ కంపెనీలు అమ్మకాలను నమోదు చేశాయి.

Next Story