Insurance: పాలసీదారులకు జీఎస్టీ మినహాయింపు పూర్తిస్థాయిలో అందించాలని ప్రభుత్వం ఆదేశాలు

by S Gopi |

పాలసీదారులకు పూర్తిస్థాయిలో అందించాలని జీవిత, అన్ని రకాల బీమా కంపెనీలను కోరింది.

Insurance: పాలసీదారులకు జీఎస్టీ మినహాయింపు పూర్తిస్థాయిలో అందించాలని ప్రభుత్వం ఆదేశాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) సంస్కరణల్లో భాగంగా బీమా పాలసీలపై పన్ను మినహాయింపు కల్పించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి మినహాయింపు ప్రయోజనాలను ప్రస్తుతం, భవిష్యత్తు పాలసీదారులకు పూర్తిస్థాయిలో అందించాలని జీవిత, అన్ని రకాల బీమా కంపెనీలను కోరింది. జీఎస్టీ సంస్కరణలను ప్రచారం చేయడానికి, బీమాను మరింత సరసమైనదిగా, సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడంలో వాటి ప్రయోజనాలను హైలైట్ చేయడానికి ముందస్తుగా ప్రచారాలను చేపట్టాలని ఆర్థిక సేవల కార్యదర్శి ఎం నాగరాజు బీమా సంస్థలను ఆదేశించారు. పన్ను మినహాయింపు చర్య బీమాను మరింత అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, తక్కువ ఖర్చుతో, అందరికీ ఆర్థిక భద్రత లభిస్తుంది. దేశవ్యాప్తంగా బీమా తీసుకునే వారి సంఖ్య కూడా పెరుగుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.

Next Story