- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Exports: మే నెలలో 2 శాతం తగ్గిన ఎగుమతులు
పెట్రోలియం, బొగ్గు, బంగారం కారణంగా మే నెలలో దిగుమతులు కూడా 1.6 శాతం తగ్గి రూ. 5.21 లక్షల కోట్లకు చేరుకున్నాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది మే నెలలో భారత ఎగుమతులు 2.17 శాతం తగ్గి 38.73 బిలియన్ డాలర్ల(రూ. 3.33 లక్షల కోట్ల)కు చేరుకున్నాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరలు తగ్గడం వల్లే ఎగుమతులపై ప్రభావం కనిపిస్తోందని సోమవారం ప్రకటనలో కేంద్ర వాణిజ్య శాఖ వెల్లడించింది. పెట్రోలియం, బొగ్గు, బంగారం కారణంగా మే నెలలో దిగుమతులు కూడా 1.6 శాతం తగ్గి 60.61 బిలియన్ డాలర్ల(రూ. 5.21 లక్షల కోట్ల)కు చేరుకున్నాయి. ఫలితంగా, ఏప్రిల్‌లో నమోదైన వాణిజ్య లోటు 26.42 బిలియన్ డాలర్ల(రూ. 2.27 లక్షల కోట్ల) నుంచి గణనీయంగా తగ్గి మే నెలలో 21.88 బిలియన్ డాలర్ల(రూ. 1.88 లక్షల కోట్ల)కు చేరుకుంది. గతేడాది ఇదే నెలలో వాణిజ్య లోటు 22 బిలియన్ డాలర్లు(రూ. 1.89 లక్షల కోట్లు)గా ఉంది. వస్తువుల ఎగుమతుల్లో క్షీణత ఉన్నప్పటికీ, అమెరికా టారిఫ్ అమలును 90 రోజుల పాటు బ్రేక్ ఇవ్వడంతో ఆ దేశానికి వెళ్లే ఎగుమతులు 17 శాతం పెరిగి రూ. 76 వేల కోట్లకు పైనే నమోదైంది. ఎగుమతుల వృద్ధికి ప్రధానంగా ఎలక్ట్రానిక్ వస్తువులు(54.1 శాతం), సేంద్రీయ, అకర్బన రసాయనాలు(16 శాతం), ఔషధాలు(7.4 శాతం), రెడీమేడ్ దుస్తులు(11.35 శాతం) దోహదపడ్డాయి. ప్రపంచ వాణిజ్యంలో అనిశ్చితి ఉన్నప్పటికీ, భారత్ మెరుగైన గణాంకాలను సాధించిందని వాణిజ్య కార్యదర్శి సునీల్ బార్త్వాల్ అన్నారు.






