- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Oracle: ఏఐ కోసం భారత్‌లో 100 మంది ఉద్యోగులను తొలగించిన ఒరాకిల్
ఈ తొలగింపులు క్లౌడ్ విభాగంతో పాటు అన్ని విభాగాల్లోని ఉద్యోగులపై ప్రభావం చూపాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోతలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా సహా పలు కంపెనీలు పెద్ద ఎత్తున లేఆఫ్‌లు ప్రకటించాయి. ఇందులో భాగంగా ఒరాకిల్ కూడా భారత్‌లో ఉద్యోగులను తొలగించింది. పునర్నిర్మాణంలో భాగంగా కంపెనీ భారత్‌లోని 100 మందికి పైగా ఉద్యోగులకు లేఆఫ్‌కు సంబంధించి లేఖలు పంపినట్టు సమాచారం. ఈ తొలగింపులు క్లౌడ్ విభాగంతో పాటు అన్ని విభాగాల్లోని ఉద్యోగులపై ప్రభావం చూపాయి. సంస్థాగత మార్పులలో భాగంగా ఈ తొలగింపు నిర్ణయం తీసుకునాం. తొలగించిన ఉద్యోగులకు 15 రోజుల జీతంతో పాటు ఏడాది వరకు వైద్య బీమా కవరేజీ అందిస్తామని కంపెనీ లేఖలో పేర్కొంది. ఈ లేఆఫ్‌లో 15-20 ఏళ్ల అనుభవం ఉన్న ఉద్యోగులు కూడా ఉండటం గమనార్హం. కంపెనీ నిర్ణయాన్ని కొందరు ఉద్యోగులు ఆకస్మిక నిర్ణయమని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఏఐ వినియోగం పెరగడం, కంపెనీ ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నాల్లో ఉండటం లాంటి మార్పుల కారణంగా ఈ నిర్ణయం తీసుకుందని కొందరు ఉద్యోగులు పేర్కొన్నారు. కృత్రిమ మేధస్సు(ఏఐ), సామర్థ్యాన్ని పెంచుతున్నందున ఒరాకిల్ ప్రపంచవ్యాప్తంగా 3,000 మందికి పైగా సిబ్బందిని తొలగించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత్‌లో కంపెనీకి 30 వేల మంది ఉద్యోగులున్నారు.






