- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SEBI: ఏడాది ఆఖరు కల్లా టాప్ 500 కంపెనీల్లో టీ+0 సెటిల్‌మెంట్: సెబీ
మార్కెట్ విలువ పరంగా టాప్-500 కంపెనీలకు టీ+0 సెటిల్‌మెంట్ ప్రక్రియ అందుబాటులోకి తీసుకురానున్నట్టు అధికారిక ప్రకటనలో వెల్లడించింది.

దిశ, బిజినెస్ బ్యూరో: స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ మంగళవారం కీలక ప్రకటన చేసింది. స్టాక్ ఎక్స్ఛేంజీల్లో షేర్ల అమ్మకం, కొనుగోలు జరిగిన అదే రోజు సెటిల్‌మెంట్ చేసే ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే ప్రస్తుత ఏడాది డిసెంబర్ 31 నాటికి మార్కెట్ విలువ పరంగా టాప్-500 కంపెనీలకు టీ+0 సెటిల్‌మెంట్ ప్రక్రియ అందుబాటులోకి తీసుకురానున్నట్టు అధికారిక ప్రకటనలో వెల్లడించింది. వీటిలో దిగువన ఉన్న 100 కంపెనీలతో మొదలుకొని ట్రేడింగ్, సెటిల్‌మెంట్ కోసం అందుబాటులోకి వస్తాయి. ఆ తర్వాత ప్రతి నెలా 100 కంపెనీలు టీ+0 సెటిల్‌మెంట్ సైకిల్‌లో ట్రేడింగ్ కోసం చేర్చబడతాయని సెబీ తన సర్క్యులర్‌లో పేర్కొంది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా పరిమిత బ్రోకర్లకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చిన 25 షేర్లకు ఇవి అదనం. కొత్తగా అనుమతిచ్చిన కంపెనీల్లో అందరు స్టాక్ బ్రోకర్లు టీ+0 సెటిల్‌మెంట్ ప్రక్రియలో పాల్గొనేందుకు అనుమతి ఉంటుంది. అలాగే స్టాక్ బ్రోకర్లు సెబీ పరిమితిలోపు టీ+0, టీ+1 సెటిల్‌మెంట్ ఏదైనా ఎంచుకునేందుకు వీలుంటుందని సెబీ వివరించింది. ఆప్షనల్ టీ+0 సెటిల్‌మెంట్ సైకిల్ పరిధిని మరింత పెంచేందుకు ఈ చర్య తీసుకున్నట్లు సెబీ వెల్లడించింది.






