- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Oppo: 7,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఒప్పో ఏ6 ప్రో విడుదల
ఏ6 సిరీస్ 80 వాట్స్ వైర్‌డ్ ఫాస్ట్ ఛార్జింగ్, రివర్స్ వైర్‌డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది

దిశ, బిజినెస్ బ్యూరో: స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఒప్పో మార్కెట్లో తన కొత్త ఏ6 సిరీస్‌లో ఏ6 ప్రో మోడల్‌ను విడుదల చేసింది. ప్రస్తుతానికి ఈ ఫోన్‌ను వియత్నాం మార్కెట్లో మాత్రమే అందుబాటులోకి తెచ్చిన ఒప్పో, త్వరలో భారత మార్కెట్లోనూ విడుదల చేయనుంది. మునుపటి ఏ6 సిరీస్ స్మార్ట్‌ఫోన్ల తరహాలోనే 80 వాట్స్ వైర్‌డ్ ఫాస్ట్ ఛార్జింగ్, రివర్స్ వైర్‌డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ ధర 8జీబీ+256జీబీ ర్యామ్ రూ. 27,900గా నిర్ణయించింది. కోరల్ పింక్, లూనార్ టైటానియం, రోజ్‌వుడ్ రెడ్, స్టెల్లార్ బ్లూ రంగుల్లో లభిస్తుంది. దుమ్ము, నీటి నుంచి రక్షణకు ఐపీ69 రేటింగ్, వెనుక కెమెరా 50ఎంపీ, సెల్ఫీ కెమెరా 16 ఎంపీ కలిగి ఉంది. ఈ ఫోన్ 6.57 అంగుళాల హెచ్‌డీ+ అమోల్‌డ్ డిస్‌ప్లే, 120హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ వంటి ఫీచర్లతో వస్తుంది. 4జీ, వైఫై, బ్లూటూత్ 5.4 జీపీఎస్ కనెక్టివిటీ ఆప్షన్లలతో మీడియాటెక్ హీలియో జీ100 చిప్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత కలర్స్ ఓఎస్ 15పై పని చేస్తుంది. సూపర్‌కూల్ వీసీ సిస్టమ్ ఉండటం వల్ల ఈ ఫోన్ ఏఐ గేమ్ బూస్ 2.0కి కూడా సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల రియల్‌టైమ్‌లో ప్లేయింగ్ స్టైల్‌కు అనుగుణంగా మెరుగైన గ్రాఫిక్స్, వేగంగా రెస్పాండ్ అవడం వల్ల మంచి గేమింగ్ అనుభూతిని ఇస్తుందని కంపెనీ వెల్లడించింది.






