- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
GST Benefits: కేవలం 10 శాతం మందికే దక్కిన జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలు
ఈ నిర్ణయం అమల్లోకి వచ్చి వారం గడుస్తున్నా పూర్తిస్థాయిలో వర్తించట్లేదని లోకల్‌సర్కిల్స్ సర్వేలో తేలింది.

దిశ, బిజినెస్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన జీఎస్టీ 2.0 సంస్కరణల ప్రయోజనాలు ఆశించిన స్థాయిలో సామాన్యులకు చేరలేదని తెలుస్తోంది. జీఎస్టీ శ్లాబుల సంఖ్యను రెండుకు తగ్గించిన ప్రభుత్వం, 90 శాతానికి పైగా సామాన్యులు వాడే వస్తువులపై జీఎస్టీని 5 శాతం పరిధిలోకి చేర్చింది. ఈ తగ్గింపు ఉపశమనం ప్రజలకు చేరువ కావాలని, తగ్గింపు ధరలను మార్చాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయినప్పటికీ ఈ నిర్ణయం అమల్లోకి వచ్చి వారం గడుస్తున్నా పూర్తిస్థాయిలో వర్తించట్లేదని ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లోకల్‌సర్కిల్స్ సర్వేలో తేలింది. జీఎస్టీ రేట్ల అమలు చాలా నెమ్మదిగా ఉంది. మిగిలిన రంగాలతో పోలిస్తే వాహన పరిశ్రమ నుంచి మాత్రమే తక్షణం, వేగంగా ధరల మార్పు జరిగింది. ప్యాకేజ్డ్ ఫుడ్, మందులపై జీఎస్టీ రేట్ల తగ్గింపు 10 మందిలో ఒకరికి మాత్రమే అందుతోంది. గృహోపకరణాలను కొనే కస్టమర్లలో ముగ్గురికి జీఎస్టీ ప్రయోజనాలు అందాయి. వాహనాల్లో ఇది చాలా ఎక్కువగా ఉందని, కొనుగోళ్లపై పూర్తి తగ్గింపు జీఎస్టీ ప్రయోజనాలు అందాయని 10 మందిలో ఏడుగురు చెప్పారని సర్వే పేర్కొంది. దేశవ్యాప్తంగా 332 జిల్లాల నుంచి సర్వే వివరాలను లోకల్‌సర్కిల్స్ సేకరించింది.






