- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Iphone: పెరగనున్న ఐఫోన్ ధరలు
డిమాండ్‌ను పెంచే లక్ష్యంతో ప్రారంభించిన ఈ కార్యక్రమం, పాత తరం ఐఫోన్‌లపై క్యాష్‌బ్యాక్ పథకాలు, ప్రమోషనల్ డిస్కౌంట్ల కోసం రిటైల్ పార్ట్‌నర్లకు అవకాశం కల్పించింది

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ ధరలు పెరగనున్నాయి. ఐఫోన్ మాతృసంస్థ యాపిల్ ఆఫ్‌లైన్ రిటైలర్ల కోసం ఉద్దేశించిన ఓ కీలక ప్రోత్సహక కార్యక్రమాన్ని నిలిపేయడంతో దేశీయంగా పాత్ ఐఫోన్ మోడళ్ల వాస్తవ ధరలు పెరిగే అవకాశం ఉందని రిటైలర్లు చెప్పినట్టు మనీకంట్రోల్ నివేదిక పేర్కొంది. డిమాండ్‌ను పెంచే లక్ష్యంతో ప్రారంభించిన ఈ కార్యక్రమం, పాత తరం ఐఫోన్‌లపై క్యాష్‌బ్యాక్ పథకాలు, ప్రమోషనల్ డిస్కౌంట్ల కోసం రిటైల్ పార్ట్‌నర్లకు అవకాశం కల్పించింది. తాజాగా దీన్ని నిలిపేయడంతో రిటైలర్లు కస్టమర్లకు ఆఫర్లు అందించడం కుదరకపోవచ్చు. దీనివల్ల ఐఫోన్ 15,16 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు ఖరీదవుతాయి. ఫలితంగా ఈ ఐఫోన్లు రూ. 5,000 వరకు పెరగవచ్చని నివేదిక పేర్కొంది. అయితే, ఈ మోడళ్లు కొత్తగా ఐఫోన్లు కొనే కస్టమర్ల కోసం ఉద్దేశించినది కావడంతో అమ్మకాలపై ప్రభావం ఉండొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. రిటైలర్లు ప్రమోషన్లను ఇవ్వకపోవడంతో సమీప భవిష్యత్తులో ఐఫోన్ల డిమాండ్, మార్జిన్లను ప్రభావం పడే అవకాశం ఉంది.






