Ola Electric: ఎస్1 ఇ-స్కూటర్‌లపై రూ. 26,750 వరకు డిస్కౌంట్ ప్రకటించిన ఓలా ఎలక్ట్రిక్

by S Gopi |

ఈ ఆఫర్ మార్చి 13-17 తేదీల మధ్య అందుబాటులో ఉంటుందని పేర్కొంది.

Ola Electric: ఎస్1 ఇ-స్కూటర్‌లపై రూ. 26,750 వరకు డిస్కౌంట్ ప్రకటించిన ఓలా ఎలక్ట్రిక్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఎలక్ట్రిక్ టూ-వీలర్ల తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ హోలీ పండుగ సందర్భంగా ఫ్లాష్ సేల్ ఆఫర్‌లను ప్రకటించింది. ఈ సేల్‌లో భాగంగా ఎస్1 సిరీస్‌లోని ఇ-స్కూటర్లపై భారీ డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు కంపెనీ అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ ఆఫర్ మార్చి 13-17 తేదీల మధ్య అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఫ్లాష్ సేల్‌లో భాగంగా ఎస్1 సిరీస్‌లో ఎయిర్ ఎ-స్కూటర్‌పై రూ. 26,750 రాయితీ అందిస్తోంది. దీంతో ఈ స్కూటర్ ధర రూ. 89,999కే లభించనుంది. మరో ఇ-స్కూటర్ ఎస్1 ఎక్స్ ప్లస్(జెన్ 2)పై కూడా రూ. 22,000 తగ్గింపును ఇస్తోంది. ఫలితంగా ఈ స్కూటర్ రూ. 82,999కి లభిస్తుంది. ఎస్1 సిరీస్‌లోని ఇతర స్కూటర్లపై కూడా సగటున రూ. 25,000 వరకు తగ్గింపు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. డిస్కౌంట్లతో పాటు రూ. 10,500 వరకు ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ స్పష్టం చేసింది. ఎస్1 జెన్ 2 స్కూటర్‌లను కొత్తగా కొనేవారికి రూ. 2,999 విలువైన ఏడాది ఉచిత మూవ్ ఓఎస్ ప్లస్, రూ. 14,999 విలువైన ఎక్స్‌టెండెడ్ వారెంటీని రూ. 7,499కే పొందవచ్చు.

Next Story