Employed People: ఆరేళ్లలో 64 కోట్లకు చేరిన ఉద్యోగుల సంఖ్య

by S Gopi |

కొత్త టెక్నాలజీ కారణంగా నైపుణ్యాల్లో వస్తున్న మార్పులతో భారత్‌లో కొత్త టెక్‌ ఉద్యోగాలను సృష్టిస్తున్నాయి.

Employed People: ఆరేళ్లలో 64 కోట్లకు చేరిన ఉద్యోగుల సంఖ్య
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో ఉద్యోగుల ప్రతి ఏటా వేగంగా పెరుగుతున్నారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 47.5 కోట్లుగా ఉన్న దేశంలోని ఉద్యోగులు 2023-24 నాటికి 64.33 కోట్లకు పెరిగారని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే గురువారం పార్లమెంటుకు తెలియజేశారు. ఆర్‌బీఐ డేటా ఆధారంగా వివరాలు పొందుపరించినట్టు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) కేపిటల్, లేబర్, ఎనర్జీ, మెటీరియల్స్, సర్వీసెస్ డేటాబేస్ ఆధారంగా తయారీ రంగం సహా దేశంలో ఉపాధి అంచనాలను వెల్లడిస్తుంది. తాజా వార్షిక పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్) నివేదిక ప్రకారం, 2019-20 నుంచి 2023-24 మధ్యకాలంలో 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తుల అంచనా వేసిన మహిళల వర్కర్ పాపులేషన్ రేషియో (డబ్ల్యూపీఆర్) 28.7 శాతం నుంచి 40.3 శాతానికి చేరిందని ఆమె తెలిపారు. పలు ప్రైవేట్ నివేదికల ప్రకారం, కొత్త టెక్నాలజీ కారణంగా నైపుణ్యాల్లో వస్తున్న మార్పులతో భారత్‌లో కీలక వృద్ధి రంగాలు కొత్త టెక్‌ ఉద్యోగాలను సృష్టిస్తున్నాయి. వ్యక్తుల లేబర్ శక్తి భాగస్వామ్య రేటు (ఎల్ఎఫ్‌పీఆర్) 2017-18లో 49.8 శాతం నుంచి 2023-24లో 60.1 శాతానికి పెరిగిందని పీఎల్ఎఫ్ఎస్ డేటా చెబుతోంది. వర్కర్ పాపులేషన్ రేషియో(డబ్ల్యూపీఆర్) 46.8 శాతం నుంచి 58.2 శాతానికి చేరిందని, నిరుద్యోగ రేటు 6 శాతం నుంచి 3.2 శాతానికి చేరిందని మంత్రి వివరించారు.

Next Story