- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
NSE: ఎన్ఎస్ఈలో కొత్త 84 లక్షల డీమ్యాట్ ఖాతాలు
ఎన్ఎస్ఈలో మొత్తం యాక్టివ్ డీమ్యాట్ అకౌంట్ల సంఖ్య 4.92 కోట్లకు చేరుకుంది.

దిశ, బిజినెస్ బ్యూరో: భారత స్టాక్ మార్కెట్లలో కొత్త ఇన్వెస్టర్లు గణనీయంగా చేరుతున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేపిటల్ మార్కెట్లలో లక్షలాది మంది కొత్త రిటైల్ పెట్టుబడిదారులు వచ్చారు. ఈ సమయంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్ఎస్ఈ)లో 84 లక్షలకు పైగా కొత్త యాక్టివ్ డీమ్యాట్ ఖాతాలు వచ్చాయి. ఏడాది ప్రాతిపదికన ఇది 20.5 శాతం ఎక్కువ, ఫలితంగా ఎన్ఎస్ఈలో మొత్తం యాక్టివ్ డీమ్యాట్ అకౌంట్ల సంఖ్య 4.92 కోట్లకు చేరుకుంది. ఈ స్థాయిలో పెరుగుదలలో ప్రధానంగా డిజిటల్ బ్రోకరేజీ కంపెనీలు గ్రో, ఏంజెల్ వన్ 57 శాతం వాటాను సొంతం చేసుకున్నాయి. అత్యధికంగా 34 లక్షల కొత్త అకౌంట్లతో గ్రో సింగిల్-లార్జెస్ట్ బ్రోకరేజ్ కంపెనీగా నిలిచింది. ఈ కంపెనీ యాక్టివ్ క్లయింట్ బేస్ గతేడాది మార్చిలో 95 లక్షలు ఉండగా, ఈ ఏడాది మార్చి నాటికి 36 శాతం వృద్ధితో 1.29 కోట్లకు పెరిగింది. ఎన్ఎస్ఈ డేటా ప్రకారం, ఇదే సమయంలో గ్రో మార్కెట్ వాటా 23.28 శాతం నుంచి 26.26 శాతానికి పెరిగింది. ఏంజెల్ వన్ కొత్తగా 14.6 లక్షల డీమ్యాట్ ఖాతాలను కొత్తగా చేర్చుకోగా, యాక్టివ్ యూజర్ బేస్ 75.7 లక్షలకు చేరుకుంది. కంపెనీ మార్కెట్ వాటా 15.38 శాతానికి పెరిగింది. కొత్తగా ఎన్ఎస్ఈలో యాడ్ అయిన డీమ్యాట్ అకౌంట్లలో ఈ రెండు కంపెనీల వాటాయే 48.6 లక్షలుగా ఉంది. ఇవి కాకుండా జెరోధా 5.8 లక్షల కొత్త డీమ్యాట్ ఖాతాలను పొందింది. ప్రధానంగా టైర్-2, టైర్-3, టైర్-4 వంటి పట్టణాల నుంచి ఎక్కువ సంఖ్యలో పెట్టుబడిదారులు చేఉతున్నారని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు.






