NPCI: యూపీఐలో ‘కలెక్ట్‌ రిక్వెస్ట్‌’ ఫీచర్‌ నిలిపేస్తూ ఎన్‌పీసీఐ నిర్ణయం

by S Gopi |

ఈ ఏడాది అక్టోబర్ 1 నుచి కలెక్ట్ రిక్వెస్ట్ సేవలను నిలిపేయనున్నారు.

NPCI: యూపీఐలో ‘కలెక్ట్‌ రిక్వెస్ట్‌’ ఫీచర్‌ నిలిపేస్తూ ఎన్‌పీసీఐ నిర్ణయం
X

దిశ, నేషనల్ బ్యూరో: డిజిటల్ చెల్లింపుల్లో ఆర్థిక మోసాలను కట్టడి చేసేందుకు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియా(ఎన్‌పీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే డిజిటల్ చెల్లింపులకు సంబంధించి యూపీఐలో అనేక మార్పులు చేసిన ఎన్‌పీసీఐ ఇటీవల ‘కలెక్ట్‌ రిక్వెస్ట్‌’ ఫీచర్‌ను తీసుకొచ్చింది. గురువారం ఈ ఫీచర్‌ను నిలిపేయాలని ఎన్‌పీసీఐ బ్యాంకులు, పేమెంట్ యాప్స్‌కు ఆదేశిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది అక్టోబర్ 1 నుచి కలెక్ట్ రిక్వెస్ట్ సేవలను నిలిపేయనున్నారు. దీనికి అనుగుణంగా బ్యాంకులు, పేమెంట్ సేవల సంస్థలు, యూపీఐ యాప్స్ మార్పులు చేసుకోవాలని ఎన్‌పీసీఐ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అక్టోబర్ 1 తర్వాత యూపీఐలో కలెక్ట్ రిక్వెస్ట్ లావాదేవీల నిర్వహించడం, ప్రాసెస్ సేవలు జరగకుండా చూసుకోవాలని వెల్లడించింది. ముఖ్యంగా కలెక్ట్ లావాదేవీలను జరగకుండా చూడాలని సూచించింది. ఈ నిర్ణయం ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం సహా అన్ని యూపీఐ యాప్‌లు, బ్యాంకులకు వరిస్తుంది. కాగా, ఎవరికైనా నగదు స్వీకరించేందుకు యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. అయితే, ఈ మధ్య డబ్బు పంపించామనే కారణంతో కొందరు సైబర్ మోసగాళ్లు యూజర్లు తమ యూపీఐ పిన్ ఎంటర్ చేసేలా నమ్మించి మోసం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఎన్‌పీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

Next Story