- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
NPCI: ఎన్విడియాతో ఎన్‌పీసీఐ భాగస్వామ్యం
ఈ భాగస్వామ్యం ద్వారా రియల్ టైమ్‌లో భారీ సంఖ్యలో లావాదేవీలను నిర్వహించడానికి, వినియోగదారులకు మరింత సమర్థవంతంగా చెల్లింపు సేవలు అందించడానికి ఏఐ ఉపయోగించనున్నారు.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశ చెల్లింపుల నెట్‌వర్క్‌లో కృత్రిమ మేధస్సు (ఏఐ) వ్యవస్థలను మరింత మెరుగ్గా ఉపయోగించేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) గ్లోబల్ టెక్ దిగ్గజం ఎన్విడియాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. భారత డిజిటల్ చెల్లింపుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పటిష్టమైన, సురక్షితమైన ఏఐ వ్యవస్థను నిర్మించడం దీని లక్ష్యం. ఈ భాగస్వామ్యం ద్వారా రియల్ టైమ్‌లో భారీ సంఖ్యలో లావాదేవీలను నిర్వహించడానికి, వినియోగదారులకు మరింత సమర్థవంతంగా చెల్లింపు సేవలు అందించడానికి ఏఐ ఉపయోగించనున్నారు. ఎన్విడియా సంస్థ దేశ చెల్లింపుల వ్యవస్థలో అధునాతన ఏఐ టెక్నాలజీని వాడుతూనే, డేటా భద్రత, గోప్యత విషయలో మనదేశ నిబంధనలను పాటిస్తుంది. ఇప్పటికే వినియోగదారుల ఫిర్యాదులను త్వరగా పరిష్కరించేలా యూపీఐ హెల్ప్ అసిస్టెంట్ వంటి సాధనాలలో ఏఐని పరీక్షించారు. ఈ ఒప్పందం దేశ డిజిటల్ చెల్లింపుల్లో కీలక మార్పులను తీసుకురానుంది. భవిష్యత్తులో ఈ ఏఐ వ్యవస్థ మొత్తం చెల్లింపు వ్యవస్థను మరింత సమర్థవంతంగా పనిచేసేలా చేస్తుంది. ప్రపంచంలోనే అత్యంత అధునాతన డిజిటల్ చెల్లింపు దేశాలలో ఒకటిగా మనదేశ స్థానాన్ని నిలుపుకోవడంలో సహాయపడుతుందని ఎన్‌పీసీఐ పేర్కొంది.






