Federal Bank: నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈపీఎఫ్ చెల్లింపులు

by S Gopi |   (  Updated:2026-05-09 02:30:35  IST  )

దీని ద్వారా బ్యాంకు ఖాతాదారులు ఇకపై నెట్ బ్యాంకింగ్ ద్వారానే ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) సంబంధిత చెల్లింపులు సులభంగా చేయవచ్చు.

Federal Bank: నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈపీఎఫ్ చెల్లింపులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ప్రైవేట్ రంగ ఫెడరల్ బ్యాంక్ ఖాతాదారుల కోసం సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా బ్యాంకు ఖాతాదారులు ఇకపై నెట్ బ్యాంకింగ్ ద్వారానే ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) సంబంధిత చెల్లింపులు సులభంగా చేయవచ్చు. ఇందుకోసం బ్యాంక్ తన డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ)తో అనుసంధానం చేసినట్టు వెల్లడించింది. ఇప్పటికే ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకులు ఈపీఎఫ్ఓ చెల్లింపుల సేవలను అందిస్తున్నాయి. ఇప్పుడు ఫెడరల్ బ్యాంక్ కూడా జాబితాలో చేరింది. ఈ సదుపాయం ద్వారా వ్యాపార సంస్థలు, కంపెనీలు కార్యాలయాలకు వెళ్లకుండా నేరుగా ఆన్‌లైన్‌లో ఈపీఎఫ్ బకాయిలను చెల్లించవచ్చు. దీంతో సమయం ఆదా అవుతుంది. ప్రభుత్వ సేవలను బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్‌లతో అనుసంధానం చేయడం వల్ల వినియోగదారులకు మరింత సౌకర్యవంతమైన డిజిటల్ సేవలు లభిస్తాయని ఫెడరల్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హర్ష్ దుగార్ పేర్కొన్నారు.

Next Story