- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Obesity Medicine: భారత్‌లో ఊబకాయాన్ని తగ్గించే ఔషధం విడుదల చేసిన నోవో నోర్డిస్క్
ఈ ఔషధం దీర్ఘకాలిక అధిక బరువును నియంత్రించడమే కాకుండా హృదయ సంబంధ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని కంపెనీ తెలిపింది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో ఊబకాయం కేసులు వేగంగా పెరుగుతున్నాయి. చాలామందిలో మారిన ఆహారపు అలవాట్లు, జీవన విధానం కారణంగా అధిక బరువుతో ఇబ్బందిపడే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో దేశీయంగా ఊబకాయం చికిత్సకు గిరాకీ పెరిగింది. దీనికి అనుగుణంగానే అనేక ఫార్మా కంపెనీలు దేశీయ మార్కెట్లో ఊబకాయం ఔషధాలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. తాజాగా డెన్మార్క్‌కు చెందిన ఫార్మా కంపెనీ నోవో నోర్డిస్క్ తన ఒబెసిటీ మెడిసిన్ 'వెగోవీ'ని మన మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఔషధం దీర్ఘకాలిక అధిక బరువును నియంత్రించడమే కాకుండా హృదయ సంబంధ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని కంపెనీ మంగళవారం ప్రకటనలో తెలిపింది. ఈ ఔషధం దేశవ్యాప్తంగా పట్టణ, గ్రామీణ మార్కెట్లలో లభిస్తుందని, జూన్ ఆఖరు నాటికి ఔషధ దుకాణాల్లో అందుబాటులో ఉంటాయని నోవో నార్డిస్క్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ విక్రాంత్ శ్రోత్రియ చెప్పారు. అధిక బరువుతో ఇబ్బందిపడుతూ, ఒబెసిటీ సంబంధిత అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న వారు ఉపయోగించేలా భారత ప్రభుత్వం నుంచి ఆమోదం లభించిందని కంపెనీ వివరించింది.
'వెగోవీ' ఔషధం ఇంజెక్షన్ రూపంలో వస్తుందని, ఇందులో సెమాగ్లూటైడ్ అనే ప్రొటీన్ ఉంటుంది. ఆహారం తీసుకున్న సమయంలో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసి పొట్ట నిండిన అనుభూతిని ఈ హార్మోన్ కలిగిస్తుంది. దీన్ని వారంలో ఒకరోజు తీసుకోవాలి, దీని ధర 0.25 ఎంజీ, 0.5ఎంజీ, 1ఎంజీ డొసుల ధర రూ. 4,366గా నిర్ణయించామని, 1.7ఎంజీ డోసు ధర రూ. 24,280, 2.4 ఎంజీ డోసు రూ. 26,015గా ఉంటుందని కంపెనీ వివరించింది. కాగా, ఈ ఏడాది మార్చిలో అమెరికాకు చెందిన ఎలీ లిల్లీ అనే ఫార్మా కంపెనీ బరువును తగ్గించే తన మౌంజారో ఔషధాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇటీవల వీటి అమ్మకాలు బాగుతున్నాయని కంపెనీ పేర్కొంది.






