- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Nothing Phone 3a: నథింగ్ నుంచి సూపర్ ఫోన్ లాంఛ్.. ఫీచర్లు ఇవే!
స్మార్ట్ ఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.

దిశ, వెబ్ డెస్క్: స్మార్ట్ ఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్. ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ నథింగ్ (Nothing) నుంచి అదిరిపోయే ఫీచర్లతో మరో కొత్త సిరీస్ ఫోన్లను లాంఛ్ చేయనుంది. నథింగ్ 3ఏ (Nothing Phone 3a) పేరుతో ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటలకు భారత మార్కెట్‌లోకి ఈ ఫోన్ ప్రవేశించనుంది. ఇక ఈ సిరీస్ నుంచి నథింగ్ ఫోన్ 3ఏ, నథింగ్ ఫోన్ 3ఏ ప్రో రెండు ఫోన్లు విడుదల కానున్నాయి. ఇప్పటికే లాంచ్ చేసిన నథింగ్ ఫోన్ 2ఏ సిరీస్‌కు మంచి ఆదరణ లభించటంతో అడ్వాన్డ్స్ ఫీచర్లతో దీనిని తీసుకువచ్చింది సంస్థ. ఈ నేపథ్యంలో ఈ నథింగ్ ఫోన్ 3ఏ వివరాలు మీకోసం.
నథింగ్ ఫోన్ (3ఏ) సిరీస్ ఫీచర్లు ఇవే..
ఈ స్మార్ట్ ఫోన్ డిజైన్ కూడా గతంలో వచ్చిన హై-ఎండ్ వేరియంట్ మొబైల్స్ మాదిరిగానే ఉండనుంది. అలాగే, బ్లాక్, వైట్ కలర్స్‌లో అందుబాటులో ఉండనుంది. ఇక మూడు బ్యాక్ కెమెరాలు (పెరిస్కోప్ టెలీఫొటో లెన్స్), గ్లిప్ ఇంటర్‌ఫేస్‌తో వస్తోంది. స్నాప్‌డ్రాగన్ 7s Zen3 ప్రాసెసర్, 6.77 అంగుళాల AMOLED డిస్‌ప్లే, 120 Hz రిఫ్రెష్ రేటుతో తీసుకువస్తోంది. 50MP ప్రధాన కెమెరా, 50MP టెలిఫొటో కెమెరా, 8MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా.. సెల్ఫీ కోసం 32MP కెమెరాను అమర్చారు. 5,000mAh బ్యాటరీ, 45W ఛార్జింగ్ సపోర్ట్‌తో రానుంది. నథింగ్ ఫోన్ 3ఏ 8gb/128gb, నథింగ్ ఫోన్ 3ఏ ప్రో 12gb /256gb అందుబాటులో ఉండనున్నాయి. ఇక దీని ధర రూ.30,౦౦౦ నుంచి ప్రారంభం కానుంది.






