- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nothing India: దేశీయంగా మొట్టమొదటి స్టోర్ ప్రారంభించిన నథింగ్ ఇండియా
ఈ ఫ్లాగ్‌షిప్ స్టోర్ ద్వారా కంపెనీ భారత మార్కెట్లో తన బ్రాండ్ కింద ఉన్న స్మార్ట్‌ఫోన్, దుస్తులు సహా ఇతర ఉత్పత్తులను విక్రయించనుంది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లు, టెక్ గ్యాడ్జెట్‌లకు భారత మార్కెట్ అత్యంత అనువైన కేంద్రంగా మారుతోంది. ఇప్పటికే భారత్ మార్కెట్లో రిటైల్ స్టోర్ల ఏర్పాటుతో ఎంట్రీ ఇచ్చిన యాపిల్ రికార్డు స్థాయిలో అమ్మకాలను సాధిస్తోంది. ఈ క్రమంలో మరో గ్లోబల్ కంపెనీ, బ్రిటీష్ బ్రాండ్ నథింగ్ దేశీయంగా తన మొట్టమొదటి ఫ్లాగ్‌షిప్ రిటైల్ స్టోర్‌ను ఏర్పాటు చేసింది. బెంగళూరులో ఏర్పాటు చేసిన ఈ స్టోర్ ప్రారంభానికి నథింగ్ సీఈఓ కార్ల్ పీ, కో-ఫౌండర్, నథింగ్ ఇండియా ప్రెసిడెంట్ అకిల్ ఎవాంజెలిడిస్ హాజరయ్యారు. ఈ ఫ్లాగ్‌షిప్ స్టోర్ ద్వారా కంపెనీ భారత మార్కెట్లో తన బ్రాండ్ కింద ఉన్న స్మార్ట్‌ఫోన్, దుస్తులు సహా ఇతర ఉత్పత్తులను విక్రయించనుంది. దేశీయంగా కంపెనీ విస్తరణకు ఈ స్టోర్ కీలక మైలురాయిగా నిలుస్తుందని కంపెనీ అభిప్రాయపడింది. ఇప్పటికే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న తమ బ్రాండ్‌కు స్థానిక కమ్యూనిటీ సంబంధాలు మరింత బలపడేందుకు ఈ స్టోర్ సహకారం అందిస్తుందని అభిప్రాయపడింది. బెంగళూరులోని ఇందిరానగర్‌లో ఉన్న ఈ స్టోర్ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలు అందుబాటులో ఉంటుందని నథింగ్ ఇండియా స్పష్టం చేసింది. ఇప్పటివరకు నథింగ్ కంపెనీ లండన్‌లో మాత్రమే స్టోర్‌ను నిర్వహిస్తోంది. దీని తర్వాత భారత్‌లో మాత్రమే రెండో స్టోర్‌ను ఏర్పాటు చేయడం గమనార్హం. ఈ స్టోర్‌లో నథింగ్ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు స్మార్ట్‌వాచ్‌లు, ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్, ఇతర స్మార్ట్ పరికరాలను కస్టమర్లు స్వయంగా సందర్శించి కొనుగోలు చేయవచ్చని కంపెనీ వెల్లడించింది.






