- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Vehicle Loan: సులభంగా కొత్త ఆర్‌సీ
వాహన ఆర్‌సీ నుంచి లోన్ హైపొథికేషన్ టెర్మినేషన్ ప్రక్రియ కోసం ఆర్‌టీఓ ఆఫీసుకు వెళ్లకుండానే, స్మార్ట్‌ఫోన్‌లో సులభంగా అప్‌డేట్ చేయవచ్చు

దిశ, బిజినెస్ బ్యూరో: గతంలో కంటే ఇప్పుడు చాలామంది తమకంటూ సొంత వాహనం ఉండాలని భావిస్తున్నారు. ఇంటి అవసరాలకో, ఆఫీసుకు వెళ్లడానికో సొంత కారు లేదా టూవీలర్ తీసుకుంటున్నారు. మొత్తం నగదు ఒకేసారి చెల్లించలేని వారు, ఫైనాన్స్ రూపంలోనే కొంటున్నారు. ఇలా ఫైనాన్స్ పద్దతిలో కొన్నప్పుడు, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్(ఆర్‌సీ) కార్డుకు హైపొథికేషన్ నిబంధన ఉంటుంది. ఈ నిబంధనలో మీరు తీసుకున్న ఫైనాన్స్ కంపెనీ లేదా బ్యాంకు పేరు ఉంటుంది. దీనర్థం, మీరు కొన్న కారు లేదా టూవీలర్ సదరు కంపెనీ వద్ద తాకట్టులో ఉన్నట్టుగా పరిగణిస్తారు.
తీసుకున్న వెహికల్ లోన్‌ను క్లియర్ చేసిన తర్వాతే హైపొథికేషన్ నిబంధనను తొలగించాల్సి ఉంటుంది. భవిష్యత్తులో మీరు వాహనాన్ని విక్రయించాలన్నా, యాజమాన్య బదిలీ చేయాలన్నా లేదా మీ ఆర్‌సీ మీదని రుజువు ఉండాలన్నా హైపోథెకేషన్ టెర్మినేషన్ ప్రక్రియ ముఖ్యమైనది. ఇదివరకు ఈ ప్రక్రియను పూర్తి చేయాలంటే చాలా ఇబ్బందులు ఉండేవి. మొదట బ్యాంకు నుంచి ఎన్ఓసీ తీసుకుని, ఆ తర్వాత ఆర్టీఓ ఆఫీసు చుట్టూ తిరగాల్సి ఉండేది. ఈ వ్యవహారాన్ని మరింత సులభతరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. వాహన ఆర్‌సీ నుంచి లోన్ హైపొథికేషన్ టెర్మినేషన్ ప్రక్రియ కోసం ఆర్‌టీఓ ఆఫీసుకు వెళ్లకుండానే, స్మార్ట్‌ఫోన్‌లో సులభంగా అప్‌డేట్ చేయవచ్చు. ఇదెలాగో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!
హైపోథెకేషన్ టెర్మినేషన్ సేవలను ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే పూర్తి చేయవచ్చు. వాహన యజమానులు వివరాలను సమర్పించి, డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయడానికి, ఇంటి నుండే రుసుము చెల్లించడానికి ఇది వీలు కల్పిస్తుంది. దీనికోసం తమ వాహనం మీద ఉన్న లోన్ మొత్తం చెల్లించిన ఓనర్లు ఆన్లైన్న్లో చేసేందుకు, కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు దగ్గర ఉంచుకోవాలి.
అయితే, కొన్ని రాష్ట్రాల్లో హైపోథికేషన్ ఫారమ్ (ఫారం 35)ను ఆన్‌లైన్‌లో చేయవచ్చు. కానీ ఆర్‌సీ నుంచి హైపోథికేషన్‌ను తొలగించడానికి అదే ఫారమ్ హార్డ్ కాపీని రిజిస్ట్రేషన్ అథారిటీకి, బ్యాంకుకు ఇవ్వాలి. ఇది కాకుండా ఆన్‌లైన్ విధానంలో చేయాలంటే..
అవసరమైన పత్రాలు
అవి.. బ్యాంక్ లేదా ఫైనాన్స్ కంపెనీ నుంచి లోన్ క్లోజర్ సర్టిఫికెట్, ఆర్టీఓ ఫారం-35, ఇన్సూరెన్స్ సర్టిఫికెట్, ఒరిజినల్ ఆర్‌సీ దగ్గరుండాలి.
* ముందుగా వాహన్ పోర్టల్ ఫరివహన్ వెబ్‌సైట్‌ని ఓపెన్ చేయాలి.
* అందులో ఆన్‌లైన్ సర్వీసెస్, వెహికల్ రిలేటెడ్ సర్వీసెస్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయాలి.
* ఆ తర్వాత వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్, ఛాసిస్ నంబర్ ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీపై క్లిక్ చేయాలి.
* రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి ఓటీపీ వచ్చిన తర్వాత సబ్మిట్ చేయాలి.
* అనంతరం 'హైపొథికేషన్ టర్నినేషన్' అనే ఆప్షన్‌ను ఎంచుకుని సబ్మిట్ చేయాలి.
* సర్వీస్ డీటెయిల్స్‌లో హైపొథికేషన్ టర్మినేషన్, ఆ తర్వాత డిలీట్ ఐకాన్‌పై నొక్కాలి.
* ఇది పూర్తయ్యాక సర్వీస్ డీటెయిల్స్‌లో ఇన్సూరెన్స్ డీటెయిల్స్‌ను ఎంచుకుని సంబంధిత వివరాలు సబ్మిట్ చేయాలి.
* అనంతరం వచ్చే డీఎంఎస్పై క్లిక్ చేసి డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలి.
* సర్వీస్ డీటెయిల్స్‌లో ఉండే ఫీ డీటెయిల్స్ ఎంచుకుని యూపీఐ లేదా కార్డు ద్వారా ఫీజు చెల్లించాలి.
* చెల్లింపు అయ్యాక సబ్మిట్ చేస్తే ప్రాసెస్ పూర్తవుతుంది.
* అంతటితో కొత్త ఆర్‌సీ ఇంటి అడ్రస్‌ను వస్తుంది.






