- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
MAIT: సోర్స్ కోడ్ షేరింగ్‌పై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేవు: ఎంఏఐటీ
గతేడాది జూన్ 18న జారీ చేసిన ప్రభుత్వ నోట్‌లో సోర్స్ కోడ్ షేరింగ్ తప్పనిసరి కాదని స్పష్టంగా చెబుతుందని ఎంఏఐటీ వివరణ ఇచ్చింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవల స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు సోర్స్ కోడ్‌ను ప్రభుత్వంతో పంచుకోవాలనే ప్రభుత్వ నిబంధనపై వ్యతిరేకత వినిపించిన సంగతి తెలిసిందే. ప్రధాన కంపెనీలన్నీ ఇలాంటి నిబంధన ప్రపంచంలోనే మరే దేశంలోనూ లేదని, దానివల్ల కస్టమర్ల వ్యక్తిగత రక్షణకు భంగమని తెలిపాయి. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (మెయిటీ) కంపెనీలు తమ సోర్స్ కోడ్‌ను పంచుకోవడాన్ని తప్పనిసరి చేయలేదని ఐటీ హార్డ్‌వేర్ కంపెనీలకు ప్రాతినిధ్యం వహించే అసోసియేషన్ ఎంఏఐటీ స్పష్టం చేసింది. గతేడాది జూన్ 18న జారీ చేసిన ప్రభుత్వ నోట్‌లో సోర్స్ కోడ్ షేరింగ్ తప్పనిసరి కాదని స్పష్టంగా చెబుతుందని ఎంఏఐటీ వివరణ ఇచ్చింది. ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ కంపెనీలు ఈ కోడ్‌ను ఎవరితోనూ పంచుకోవాలని బలవంతం చేసే ఎటువంటి నియమాన్ని రూపొందించలేదని వెల్లడించింది. ప్రభుత్వం తప్పనిసరి సోర్స్ కోడ్ షేరింగ్‌ను కోరుకుంటున్నట్లు పేర్కొన్న వచ్చిన నివేదికలు తప్పు అని పేర్కొంది. కంపెనీల సాఫ్ట్‌వేర్ వివరాలకు రక్షణ ఉంటుందని ప్రభుత్వం స్పష్టంగా చెబుతోందని, ప్రస్తుతం సోర్స్ కోడ్‌ను పంచుకోవడంపై తప్పనిసరి అనే ఎలాంటి నియమం లేదని వెల్లడించింది.






