- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
FDIs: సరిహద్దు దేశాల ఎఫ్‌డీఐల్లో ఎలాంటి మార్పు లేదు
భారత్‌తో భూ సరిహద్దులు ఉన్న దేశాల నుంచి పెట్టుబడుల కోసం 2020లో కేంద్ర ప్రభుత్వం ప్రెస్ నోట్‌ను తీసుకొచ్చింది.

దిశ, బిజినెస్ బ్యూరో: చైనా నుంచి వచ్చే ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి దరఖాస్తులను ఎటువంటి పరిశీలన లేకుండా అనుమతిస్తున్నట్టు వస్తున్న కథనాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. భారత్‌తో సరిహద్దులు కలిగిన దేశాలకు చెందిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) పాలసీ విధానంలో ఎలాంటి మార్పులు చేయలేదని స్పష్టం చేసింది. ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి సవరణలు చేయలేదని పేర్కొంది. భారత్‌తో భూ సరిహద్దులు ఉన్న దేశాల నుంచి పెట్టుబడుల కోసం 2020లో కేంద్ర ప్రభుత్వం ప్రెస్ నోట్‌ను తీసుకొచ్చింది. దీని ప్రకారం, భూ సరిహద్దు దేశాల పెట్టుబడిదారులు ఏ రంగంలోనైనా పెట్టుబడులు పెట్టాలంటే ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ నిబంధన బంగ్లాదేశ్‌తో పాటు చైనా, పాకిస్తాన్, భూటాన్, మయన్మార్, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలన్నింటికి వర్తిస్తుందని వివరించింది. ఈ దేశాల నుంచి వచ్చే అన్ని ఎఫ్‌డీఐ దరఖాస్తుల పరిశీలన, అనుమతులు ఒకే ప్రక్రియలో జరుగుతాయని వెల్లడించింది. ఈ ప్రెస్ నోట్‌లో మార్పులేమీ జరగలేదని, చైనా ఎఫ్‌డీఐల గురించి వస్తున్న వార్తలు పుకార్లేనని ప్రభుత్వం పేర్కొంది.






