అన్ని ఎలక్ట్రిక్ బస్సులకు ఒకే ఛార్జింగ్ విధానం అవసరం: నితిన్ గడ్కరీ!

by Disha Web Desk 7 |
అన్ని ఎలక్ట్రిక్ బస్సులకు ఒకే ఛార్జింగ్ విధానం అవసరం: నితిన్ గడ్కరీ!
X

న్యూఢిల్లీ: దేశంలోని వివిధ కంపెనీలు తయారు చేసే ఎలక్ట్రిక్ బస్సులకు ఒకే రకమైన ఛార్జింగ్ విధానం ఉండేలా చూసుకోవాలని రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. మంగళవారం జరిగిన మైండ్‌మైన్ సమ్మిట్ సమావేశంలో మాట్లాడిన ఆయన, వేర్వేరు కంపెనీలు వేర్వేరు ఛార్జింగ్ వ్యవస్థను కలిగి ఉండటం వల్ల రాష్ట్రాలను బట్టి మారుతూ, కొత్త సమస్యలు ఎదురవుతున్నాయని గడ్కరీ తెలిపారు. దీనికి పరిష్కారంగా ఒకే ఛార్జింగ్ విధానం తీసుకొచ్చే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని తన మంత్రిత్వ శాఖ అధికారులకు సూచించినట్టు ఆయన చెప్పారు.

ప్రజా రవాణాను వీలైనంత ఎక్కువమంది వినియోగించేలా ప్రోత్సాహం అందించాలి. ముఖ్యంగా ఎక్కువ కార్లను కొనుగోలు చేయకుండా, మెట్రో నగరాల్లో ఏసీ బస్సు సర్వీసులను తీసుకురావాల్సి ఉంది. మరో రెండేళ్లలో దేశవ్యాప్తంగా సాంప్రదాయ ఇంధన వాహనాల స్థాయికి ఎలక్ట్రిక్ వాహనాలు చేరుకుంటాయనే అంచనాలున్నాయి. 2024 చివరి నాటికి దేశ రవాణా వ్యయం జీడీపీలో 10 శాతానికి తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నట్టు గడ్కరీ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఇది 14-16 శాతం వద్ద ఉంది. భవిష్యత్తులో గ్రీన్ హైడ్రోజన్ ప్రధాన వినియోగం ఇంధనంగా ఉండనుందని ఆయన వెల్లడించారు.

Next Story

Most Viewed