- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nita Ambani: అమెరికా నుంచి అరుదైన గౌరవం పొందిన నీతా అంబానీ
ప్రశంసాపత్రాన్ని నీతా అంబానీకి బోస్టన్‌లో జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా మసాచుసెట్స్ గవర్నర్ మౌరా హీలీ అందించారు.

దిశ, బిజినెస్ బ్యూరో: రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్, వ్యవస్థాపకురాలు నీతా అంబానీకి అమెరికా నుంచి అరుదైన గౌరవం దక్కించింది. దాతృత్వం, సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు గ్లోబల్ ఛేంజ్ మేకర్‌గా అందిస్తున్న సేవలకు గుర్తింపుగా మసాచుసెట్స్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక గవర్నర్ ప్రశంసా పత్రాన్ని అందించింది. ప్రశంసాపత్రాన్ని నీతా అంబానీకి బోస్టన్‌లో జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా మసాచుసెట్స్ గవర్నర్ మౌరా హీలీ అందించారు. ఈ మేరకు నీతా అంబానీ కార్యాలయ అధికారులు ప్రకటన విడుదల చేశారు. నీతా అంబానీ గొప్ప వితరణశీలిగానే కాకుండా దార్శనిక లీడర్‌గా గ్లోబల్ గేమ్ ఛేంజర్‌గా ఉన్నారు. భారత సహా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి విద్య, ఆరోగ్య, కళలు, సంస్కృతి, క్రీడల కోసం ఆమె సేవలు ప్రశంసనీయం. వివిధ విభాగాల్లో ఆమె అందించిన సేవలను గుర్తించి ప్రశంసా పత్రం అందించినట్టు అధికారులు పేర్కొన్నారు.






