బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకులను బలోపేతం చేయాలి: నిర్మలా సీతారామన్

by Disha Web Desk 17 |
బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకులను బలోపేతం చేయాలి: నిర్మలా సీతారామన్
X

న్యూఢిల్లీ: సరిహద్దు సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు వంటి బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకులను (MDB) బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. జపాన్‌లోని నీగాటాలో G7 సెమినార్‌లో ప్రసంగించిన ఆమె, ‘స్థిరమైన వృద్ధి, ఆర్థిక లక్ష్యాలను సమతుల్యం చేయడం, సమ్మిళిత వృద్ధిని సాధించడానికి డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌‌ను మెరుగుపరచడం చాలా అవసరమని పేర్కొన్నట్లు’ ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్వీట్‌లో పేర్కొంది. పేదలకు మార్కెట్‌లు, ప్రాథమిక సేవలను అందుబాటులోకి తెవడానికి డిజిటల్ కనెక్టివిటీ అవసరం ఉందని ఈ సందర్బంగా ఆమె అన్నారు. సీతారామన్ రెండు రోజుల పర్యటనలో (మే 11-12) జపాన్‌లో ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల G7 సమావేశానికి హాజరు అయ్యారు.

Also Read...

డేటా గవర్నెన్స్ క్వాలిటీ ఇండెక్స్‌‌లో రెండో స్థానంలో షిప్పింగ్ మంత్రిత్వ శాఖ

Next Story

Most Viewed