Mutual Fund: మ్యాజిక్ స్కీమ్.. లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుందో తెలుసా?

by Vennela |

Mutual Fund: మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల్లో కాంపౌండింగ్ మ్యాజిక్ ఉంటుంది.

Mutual Fund: మ్యాజిక్ స్కీమ్.. లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుందో తెలుసా?
X

దిశ,వెబ్‌డెస్క్: Mutual Fund: మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల్లో కాంపౌండింగ్ మ్యాజిక్ ఉంటుంది. వడ్డీపై వడ్డీ జనరేట్ అవుతుంది. దీంతో దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో కార్పస్ ఫండ్ ఏర్పడుతుంది. అలాంటి ఒక స్కీమ్ ఒకసారిగా రూ. 1లక్ష పెట్టుబడి పెట్టినవారికి రూ. 3.62కోట్లు ఇచ్చింది. ఆ స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తున్న వారి సంఖ్య ఈమధ్య కాలంలో భారీగా పెరిగింది. హై రిటర్న్స్ కోసం చాలా మంది రిస్క్ కూడా తీసుకుంటున్నారు. నిపుణుల సలహాతో మంచి ఫండ్స్ ఎంచుకుని పెట్టుబడి పెడుతున్నారు. మ్యూచువల్ ఫండ్స్ లో ప్రస్తుతం చాలా పథకాలు అందుబాటులో ఉన్నాయి. గత చరిత్రను తెలుసుకుని ప్రస్తుత పనితీరును అంచనా వేస్తూ పెట్టుబడి పెట్టగలిగితే పెద్ద మొత్తంలో కార్పస్ ఏర్పాటు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇలా తమ పెట్టుబడిదారులను కోటీశ్వరులను చేసిన స్కీములు చాలానే ఉన్నాయి. అందులో ఒకటి నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్. ఈ స్కీములో ఒకసారి రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టి వదిలేసిన వారికి ఇప్పుడు ఏకంగా రూ. 3.62కోట్లు వచ్చాయి. ఆ స్కీము గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ స్కీముకు ప్రజాదరణ లభిస్తోంది. ఈ ఫండ్ నెట్ అసెట్ వాల్యూ ఏకంగా రూ. 3625.69కోట్లుగా ఉంది. ఈ పథకం లాంచ్ అయినప్పటి నుంచి చూసుకుంటే భారీ రిటర్న్స్ ఇచ్చింది. ఈ స్కీములో సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ ద్వారా నెలకు రూ. 1000 చొప్పున పెట్టుబడి పెట్టినట్లయితే ఇప్పుడు ఆ విలువ రూ. 2.31కోట్లు అవుతుంది. గడిచిన 29ఏళ్లలో ఈ స్కీము సగటు వార్షిక సిప్ రాబడి 22.62 శాతం మేర ఉన్నట్లు ఈటీ మ్యూచువల్ ఫండ్ తెలిపింది. నెలకురూ. 1000 చొప్పున క్రమం తప్పకుండా సిప్ చేసినవారికి ఏకంగా రూ. 2.31కోట్లు వచ్చాయి.

నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ పథకం అక్టోబర్ 8, 1995న విడుదల చేశారు. ఈ స్కీమ్ వాల్యూ రీసెర్చ్, మార్నింగ్ స్టార్స్ 4 స్టార్ రేటింగ్స్ ఇచ్చాయి. ఒక పెట్టుబడిదారులు ఈ పథకం లాంచ్ అయినప్పుడు రూ. 1లక్ష పెట్టుబడి పెట్టి ఇప్పటి వరకు కొనసాగినట్లయితే ఇప్పుడు ఆ విలువ రూ. 3.62 కోట్లుగా ఉంటుంది. ఈ స్కీము CAGR రేటు 22.25శాతంగా ఉంది. అలాగే గత 25ఏళ్లలో చూస్తే ఈ పథకం సీఏజీఆర్ రేటు 19.6శాతంగా ఉంటుంది. అంటే లక్ష రూపాయల పెట్టుబడి రూ. 89.65లక్షలు అవుతుంది. అలాగే గత 10ఏళ్లలో రిటర్న్స్ గమనిస్తే కాస్త తగ్గాయి. సీఏజీఆర్ 10శాతంగా ఉంది. గత 5ఏళ్లలో చూస్తే 24.34శాతం మేర రిటర్న్స్ ఇచ్చింది. అయితే గతంలో వచ్చిన రాబడులు ముందు ముందు వస్తాయని కచ్చితంగా చెప్పలేము. పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే పెట్టుబడి పెట్టాలి.

Next Story