- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Nifty: ఆల్‌టైమ్ గరిష్టానికి నిఫ్టీ
కీలక ఎనర్జీ, బ్యాంకింగ్, మెటల్ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతుతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 573 పాయింట్లు ఎగబాకింది

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ ఈక్విటీ మార్కెట్లు కొత్త ఏడాది రెండో రోజే భారీ లాభాలను సాధించాయి. శుక్రవారం ట్రేడింగ్‌లో ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీ నిఫ్టీ జీవితకాల గరిష్ట స్థాయిని తాకి, 182 పాయింట్లు లాభపడింది. కీలక ఎనర్జీ, బ్యాంకింగ్, మెటల్ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతుతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 573 పాయింట్లు ఎగబాకింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు లేనప్పటికీ, దేశీయంగా రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లలో ఇన్వెస్టర్లు ఎక్కువ కొనుగోళ్లు జరపడంతో ర్యాలీ కొనసాగింది. ఆసియా మార్కెట్లలో బలమైన ర్యాలీతో పాటు దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు పెట్టుబడులను కొనసాగించడం కూడా స్టాక్ మార్కెట్‌కు మద్దతు లభించిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మరోవైపు రాబోయే మూడో త్రైమాసిక ఫలితాలు, కేంద్ర బడ్జెట్ వంటి అంశాలకు సంబంధించి అంచనాలు మదుపర్ల సెంటిమెంట్‌ను పెంచాయని తెలిపారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 573.41 పాయింట్లు ఎగసి 85,762 వద్ద, నిఫ్టీ 182 పాయింట్లు లాభపడి 26,328 పాయింట్లతో కొత్త రికార్డులను నమోదు చేశాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎన్‌టీపీసీ, ట్రెంట్, బజాజ్ ఫైనాన్స్, పవర్‌గ్రిడ్, ఎస్‌బీఐ, మారుతీ సుజుకి షేర్లు అధిక లాభాలను సాధించాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 90.15కి చేరింది.






