- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
NHAI: హైవేలపై ప్రమాదాల నివారణకు 'సేఫ్టీ అలర్ట్ సిస్టమ్'
ఎస్సెమ్మెస్, వాట్సాప్, అధిక ప్రాధాన్యత గల కాల్స్ ద్వారా హెచ్చరికలు పంపనున్నట్టు ఎన్‌హెచ్ఏఐ ఓ ప్రకటనలో తెలిపింది.

దిశ, బిజినెస్ బ్యూరో: నేషనల్ హైవేలపై భద్రతను పెంచేందుకు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్ఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ రహదారుల అంతటా మొబైల్ ఆధారిత భద్రతా హెచ్చరిక వ్యవస్థ కోసం రిలయన్స్ జియోతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసినట్లు ఎన్‌హెచ్ఏఐ మంగళవారం ప్రకటిచింది. టెలికాం ఆధారిత సేఫ్టీ అలర్ట్ సిస్టమ్‌గా పిలిచే ఈ వ్యవస్థ ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాలు, పశువులు విచ్చలవిడిగా తిరిగే, పొగమంచు ఎక్కువగా ఉండే ప్రాంతాలు, అత్యవసర మలుపుల గురించి ప్రయాణికులకు హెచ్చరిస్తుంది. అందుకోసం వారికి ఎస్సెమ్మెస్, వాట్సాప్, అధిక ప్రాధాన్యత గల కాల్స్ ద్వారా హెచ్చరికలు పంపనున్నట్టు ఎన్‌హెచ్ఏఐ ఓ ప్రకటనలో తెలిపింది. టెలికాం కంపెనీ జియోకు చెందిన 4జీ, 5జీ నెట్‌వర్క్ ద్వారా ప్రయాణికుల మొబైల్‌ఫోన్‌లకు ముందుగా అలర్ట్ మెసేజ్‌లు చేరుతాయి. ప్రమాదం ఉండే ప్రాంతాలు రాగానే వారు అప్రమత్తం అయ్యేందుకు వీలవుతుంది. ఈ వ్యవస్థను దశలవారీగా ఎన్‌హెచ్ఏఐ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లతో అనుసంధానం చేస్తారు. వాటిలో ‘రాజ్‌మార్గయాత్ర’ మొబైల్ యాప్, అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్ 1033 లింక్ చేస్తారు. ఈ వ్యవస్థ పూర్తిగా ఇప్పటికే ఉన్న టెలికాం టవర్ల ద్వారా పనిచేస్తుంది. దీనివల్ల అలర్ట్ మెసేజ్‌లు, కాల్స్ అత్యంత వేగంగా చేరతాయి. ప్రస్తుతానికి ఈ సేవలు జియో యూజర్లకు మాత్రమే ఉంటాయని, అనంతరం ఇతర కంపెనీల యూజర్లకూ అమలవుతాయని ఎన్‌హెచ్ఏఐ పేర్కొంది.






