- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
SBI: కొత్త జీఎస్టీ సంస్కరణలతో ప్రభుత్వానికి రూ. 3,700 కోట్ల నష్టం
అంతిమ నష్టం రూ. 3,700 కోట్లకు పరిమితమవుతుందని ఎస్‌బీఐ నివేదిక తెలిపింది.

దిశ, బిజినెస్ బ్యూరో: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) సంస్కరణలలో భాగంగా రేట్ల తగ్గింపు ద్వారా ప్రభుత్వానికి రూ. 3,700 కోట్ల ఆదాయ నష్టాన్ని ఏర్పడుతుందని ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తాజా నివేదిక పేర్కొంది. ఈ రేట్ల కోత వల్ల ఏడాదిలో రూ. 48,000 కోట్ల నష్టాన్ని ప్రభుత్వం అంచనా వేయగా, వ్యవస్థలో వినియోగంతో పాటు వృద్ధి పుంజుకోవడం మూలంగా అంతిమ నష్టం రూ. 3,700 కోట్లకు పరిమితమవుతుందని ఎస్‌బీఐ నివేదిక తెలిపింది. ఇదే సమయంలో ఆర్థిక లోటుపై ప్రభావం ఉండకపోవచ్చని పేర్కొంది. జీఎస్టీ రేట్లను సవరించడం ద్వారా బ్యాంకింగ్ రంగంలో ఖర్చులు తగ్గుతాయి. ఫలితంగా మొత్తం బ్యాంకింగ్ కార్యకలాపాల్లో సానుకూల ప్రభావం ఉంటుంది. గతంలో నాలుగు శ్లాబులుగా ఉన్న జీఎస్టీ రేట్లు ఉండేవి. అందులో సుమారు 295 రకాల వస్తువులపై 12 శాతంగా ఉన్న జీఎస్టీ 5 శాతానికి దిగొచ్చింది. దీనివల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రిటైల్ ద్రవ్యోల్బణం 25-30 బేసిస్ పాయింట్లు(0.25-0.3 శాతం) తగ్గుతుందని ఎస్‌బీఐ నివేదిక వివరించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం 2026-27లో కూడా ద్రవ్యోల్బణం 65-75 బేసిస్ పాయింట్లు పడిపోవచ్చని నివేదిక వెల్లడించింది.






