- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Google Maps: గూగుల్ మ్యాప్స్‌లో కొత్త ఫీచర్లు.. మెట్రో టికెట్ బుకింగ్, ట్రాఫిక్ అలర్ట్, మరెన్నో..
దిగ్గజ నావిగేషన్ యాప్ అయిన గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: దిగ్గజ నావిగేషన్ యాప్ అయిన గూగుల్ మ్యాప్స్ (Google Maps) కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. భారత్‌లో గూగుల్ మ్యాప్స్ కోసం 10 కొత్త అప్‌డేట్‌లను ప్రకటించింది. ఇందులో జెమినీ ఏఐ, వాయిస్ ఇంటరాక్షన్, సేఫ్టీ నోటిఫికేషన్లు, ట్రాఫిక్ అలర్ట్, యాక్సిడెంట్ జోన్ల వార్నింగ్, మెట్రో టికెట్ బుకింగ్ తదితర సదుపాయాలను గూగుల్ మ్యాప్స్ తీసుకొస్తోంది.
వాయిస్ ఇంటరాక్షన్‌తో డ్రైవింగ్‌లో ఉండగానే రెస్టారెంట్లు, ఇతర వ్యాపారాలు, ప్రదేశాల గురించి తెలుకోవచ్చు, రోడ్డు గరిష్ట వేగం కూడా తెలుసుకునే ఫీచర్ కల్పించారు. పార్కింగ్ స్థలం లాంటి ప్రశ్నలు అడగవచ్చు. అలాగే జీ మెయిల్, క్యాలెండర్ వంటి ఇతర యాప్‌లకు కూడా కనెక్ట్ అయ్యే అవకాశం ఇచ్చారు. రైడర్లు బైక్ ఐకాన్, రంగును మార్చుకునే అవకాశం సైతం కల్పించారు. ఢిల్లీ, ముంబాయి, బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో ప్రమాదాలు, వేగ పరిమితి హెచ్చరికల గురించి అప్రమత్తం చేయనుంది.
మరింత సులభమైన ప్రయాణం కోసం ఈ కొత్త అప్‌డేట్‌లు తీసుకొచ్చారు. ఇది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) నుంచి రియల్-టైమ్ హైవే డేటాను కూడా పొందుతుంది. Google Wallet ద్వారా తమ మెట్రోను యాక్సెస్ చేయడానికి అనుమతిస్తోంది. ఈ కొత్త అప్‌డేట్‌లు Android, iOS వినియోగదారులకు అందుబాటులో ఉండనున్నాయి. ఈ వివరాలను గూగుల్ మ్యాప్స్ ఇండియా జనరల్ మేనేజర్ లలిత రమణి పేర్కొన్నారు.






