KTM: కేటీఎం నుంచి కొత్త బైకు... ధర, ఫీచర్స్ ఇవే

by velandi.Saikiran |

ఇండియన్ మార్కెట్లోకి అనేక రకాల వాహనాలు వస్తున్నాయి. ఒకప్పుడు సైకిల్ ఉంటేనే గొప్ప అనే వాళ్ళు. కానీ ఇప్పుడు

KTM: కేటీఎం నుంచి కొత్త బైకు... ధర, ఫీచర్స్ ఇవే
X

దిశ, వెబ్ డెస్క్ : ఇండియన్ మార్కెట్లోకి అనేక రకాల వాహనాలు వస్తున్నాయి. ఒకప్పుడు సైకిల్ ఉంటేనే గొప్ప అనే వాళ్ళు. కానీ ఇప్పుడు ఇంటింటికి ఒకటి కాదు రెండు బైకులు కూడా ఉన్నాయి. దీనికి తగ్గట్టుగానే రకరకాల మోడల్స్ లో బైక్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. అయితే తాజాగా... కెటిఎమ్ నుంచి సరికొత్త బైక్.. మార్కెట్లోకి వచ్చేసింది. యూత్ ను బాగా ఆకట్టుకునే కెటిఎమ్ (KTM)... అదిరిపోయే అధునాతన బైక్ లాంచ్ చేసింది.

అడ్వెంచర్ ఎక్స్ 390 మోడల్ ను (KTM 390 Adventure )అప్డేట్ చేసి మరి... రిలీజ్ చేసింది కంపెనీ. రెండు మోడల్స్ లో ఈ బైక్ లభించనుంది. ఇందులో మొదటి మోడల్ కెటిఎమ్ బైక్ ధర 3.03 లక్షలు గా ఉంది. అలాగే మరో మోడల్ 3.52 లక్షలుగా ఫిక్స్ చేశారు. ఈ ధరలు కేవలం పూణే షోరూం ప్రకారం మాత్రమే. మిగతా ప్రాంతాల్లో ధరలు ఎక్కువ కావచ్చు. లేదా తగ్గవచ్చు. ఇక ఈ బైక్ లకు అదిరిపోయే ఫీచర్లు కూడా ఉన్నాయి. యాంటీ బ్రేక్ సిస్టం, క్రూజ్ కంట్రోల్ యాంటీ బ్రేకింగ్ సిస్టం కూడా ఉన్నాయి.

Next Story