- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Apple: బెంగళూరులో యాపిల్ కొత్త స్టోర్ ఏర్పాటు
ఫీనిక్స్ మాల్ ఆఫ్ ఆసియాలో యాపిల్ స్టోర్ ప్రారంభిస్తోందని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో వెల్లడించాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: గ్లోబల్ టెక్ దిగ్గజం యాపిల్ ఇప్పటికే భారత్‌లో రెండు స్టోర్లను నిర్వహిస్తోంది. ఇటీవల కంపెనీ ఆర్థిక ఫలితాల సందర్భంగా కంపెనీ సీఈఓ టిమ్ కుక్ భారత్‌లో మరో నాలుగు కొత్త యాపిల్ స్టోర్లు ఏర్పాటు చేస్తామని, అవి బెంగళూరు, పూణె, ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబైలలో ఉంటాయని చెప్పారు. అయితే, ఎప్పుడు, ఏ నగరంలో స్టోర్లను ప్రారంభిస్తారనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. అయితే, తాజాగా బెంగళూరు స్థిరాస్తి రంగ వర్గాలు యాపిల్ బైతారాయణపురలోని ఫీనిక్స్ మాల్ ఆఫ్ ఆసియాలో యాపిల్ స్టోర్ ప్రారంభిస్తోందని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో వెల్లడించాయి. దీనిపై యాపిల్ అధికారికంగా స్పందించకపోయినప్పటికీ, నార్త్ బెంగళూరులోని మరికొన్ని రియల్ ఎస్టేట్ వర్గాలు ధృవీకరించాయి. ప్రస్తుతం యాపిల్ దేశీయంగా ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో, ఢిల్లీలోని సాకెత్‌లలో రెండు స్టోర్లను నిర్వహిస్తోంది. గణాంకాల ప్రకారం, ఈ రెండు స్టోర్లు నెలకు రూ. 22,000-25,000 కోట్ల వరకు ఆదాయం సంపాదిస్తున్నాయి. భారత్‌లో యాపిల్ చేపడుతున్న విస్తరణ కారణంగా ఈ ఏడాది తొలి త్రైమాసికం నాటికి కంపెనీ మార్కెట్ వాటా గతేడాదితో పోలిస్తే 23 శాతానికి పైగా పెరిగింది. దీనివల్ల చైనా, అమెరికా, జపాన్ తర్వాత భారత్ నాలుగో అతిపెద్ద మార్కెట్‌గా మారింది.






