FDIs: భారీగా క్షీణించిన ఎఫ్‌డీఐ పెట్టుబడులు

by S Gopi |

మనదేశం నుంచి బయటకు వెళ్లిన పెట్టుబడులు ఎక్కువగా ఉండటం వల్ల నికర ఎఫ్‌డీఐ వరుసగా ఐదవ నెలలోనూ క్షీణించింది.

FDIs: భారీగా క్షీణించిన ఎఫ్‌డీఐ పెట్టుబడులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఆర్థికవ్యవస్థ బలమైన వృద్ధిని సాధిస్తున్నప్పటికీ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పెట్టుబడుల్లో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ ఏడాది జనవరిలో స్థూల ఎఫ్‌డీఐలు సుమారు 5.7 బిలియన్‌ డాలర్లు(రూ. 52.80 వేల కోట్లు)గా ఉన్నప్పటికీ, మనదేశం నుంచి బయటకు వెళ్లిన పెట్టుబడులు ఎక్కువగా ఉండటం వల్ల నికర ఎఫ్‌డీఐ వరుసగా ఐదవ నెలలోనూ క్షీణించింది. భారత్ నుంచి బయటకు తరలించిన మొత్తం ఎఫ్‌డీఐలు దాదాపు రెట్టింపు అయి 4.9 బిలియన్ డాలర్ల(రూ. 45.37 వేల కోట్ల)కు చేరింది. అంటే దేశంలోకి పెట్టుబడులు వస్తున్నప్పటికీ, వాటిలో ఎక్కువ భాగం తిరిగి బయటకు వెళ్తోంది. ఇందుకు ప్రధాన కారణాలు అంతర్జాతీయంగా పోటీ నెలకొనడం, పెట్టుబడి ధోరణుల్లో మార్పులు చోటుచేసుకోవడమని నిపుణులు తెలిపారు. ప్రధానంగా మెక్సికో, పోలాండ్, వియత్నాం వంటి దేశాలు పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. మరోవైపు, జెన్ఏఐ, టెక్నాలజీ రంగాల్లో అమెరికా ముందంజలో ఉండటంతో, పెద్ద మొత్తంలో పెట్టుబడులు అక్కడికి వెళ్తున్నాయి. అదనంగా, భారత కంపెనీలు విదేశాల్లో పెట్టుబడులు (ఓడీఐ) పెంచడం కూడా నికర ఎఫ్‌డీఐల క్షీణతకు కారణమవుతోంది.

Next Story