- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Net Direct Taxes: 4 శాతం తగ్గిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు
మొత్తం వసూళ్లలో నికర కార్పొరేట్ పన్ను వసూళ్లు దాదాపు రూ.2.29 లక్షల కోట్లు నమోదయ్యాయి

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 3.95 శాతం తగ్గి రూ.6.64 లక్షల కోట్లకు చేరుకున్నాయని మంగళవారం విడుదల చేసిన ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. గత ఆర్థిక సంవత్సరం (2024-25) ఇదే కాలంలో సేకరించిన రూ.6.91 లక్షల కోట్ల వసూళ్లు జరిగాయి. అధిక రీఫండ్‌ల కారణంగానే వసూళ్లలో క్షీణత నమోదైందని ప్రభుత్వం తెలిపింది. మొత్తం వసూళ్లలో నికర కార్పొరేట్ పన్ను వసూళ్లు దాదాపు రూ.2.29 లక్షల కోట్లు కాగా, కార్పొరేట్ యేతర పన్ను వసూళ్లు రూ.4.12 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 11 మధ్య సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను (ఎస్‌టీటీ) వసూళ్లు రూ.22,362 కోట్లు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు జారీ చేసిన వాపసులు 10 శాతం పెరిగి రూ.1.35 లక్షల కోట్లకు చేరుకున్నాయి. సమీక్షించిన కాలంలో స్థూల వసూళ్లు (రీఫండ్‌లకు ముందు) రూ.7.99 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇది గత సంవత్సరం ఇదే కాలంలో వచ్చిన రూ.8.14 లక్షల కోట్ల కంటే 1.87 శాతం తగ్గింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2025-26) ప్రభుత్వం ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.25.20 లక్షల కోట్లు వస్తాయని అంచనా వేసింది, ఈ మొత్తం క్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 12.7 శాతం ఎక్కువ. ఇదే సమయంలో ఎస్‌టీటీల నుంచి రూ.78,000 కోట్లు వసూలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.






