Digital World: దేశీయ డిజిటల్ భద్రతకు మరింత పటిష్టమైన టెక్నాలజీ అవసరం: నిర్మలా సీతారామన్

by S Gopi |

సరిహద్దుల్లో మాత్రమే కాదు, దేశ భద్రతకు ఎదురయ్యే కొత్త సవాళ్లను గుర్తించడం చాలా ముఖ్యం.

Digital World: దేశీయ డిజిటల్ భద్రతకు మరింత పటిష్టమైన టెక్నాలజీ అవసరం: నిర్మలా సీతారామన్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ డిజిటల్ రంగానికి మరింత భద్రత కల్పించేలా టెక్ పరిజ్ఞానాన్ని పటిష్టం చేసుకోవాల్సిన అవసరమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. సోమవారం గుజరాత్‌లోని గాంధీనగర్‌లో రాష్ట్రీయ రక్షా విశ్వవిద్యాలయం నాల్గవ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన నిర్మలా సీతారామన్.. స్వార్థ ప్రయోజనాల కోసం టెక్నాలజీని దుర్వినియోగం చేసే పరిస్థితుల కారణంగా దేశ ఆర్థిక సేవలు, జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, దాని పరిష్కారానికి టెక్ పరిజ్ఞానాన్ని బలోపేతం చేయాలన్నారు. సరిహద్దుల్లో మాత్రమే కాదు, దేశ భద్రతకు ఎదురయ్యే కొత్త సవాళ్లను గుర్తించడం చాలా ముఖ్యం. టెక్నాలజీ అందులో ఒకటి. ఉత్పాదకతను పెంచగలిగే స్థాయిలో టెక్నాలజీ అందుబాటులో ఉన్నందున, కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం దాన్ని దుర్వినియోగం చేయవచ్చు. ప్రజల జీవితాల్లో సాధారణమైపోయిన టెక్నాలజీ ద్వారా దేశంలోని డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేక సవాళ్లను చూస్తోంది. ముఖ్యంగా బ్యాంకులు, స్టాక్ మర్కెట్, చెల్లింపుల సంస్థలు, ఆన్‌లైన్ మార్కెటింగ్, క్యాబ్ సేవలను నిర్వహించే ప్లాట్‌ఫామ్‌లతో సహా అనేక సంస్థలు సైబర్ బెదిరింపులను ఎదుర్కొంటున్నాయని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

Next Story