- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
SIM Cards: ఏఐ ద్వారా 40 లక్షల నకిలీ సిమ్ కార్డుల బ్లాక్
టెలికాం కంపెనీలు, ఆర్థిక సంస్థలతో టెలికమ్యూనికేషన్స్ విభాగం(డీఓటీ) భాగస్వామ్యం ద్వారా ఇది సాధ్యమైంది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో డిజిటల్ వినియోగం పెరుగుతున్న కొద్దీ, మోసాలు కూడా అంతే స్థాయిలో జరుగుతున్నాయి. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం కృత్రిమ మేధ(ఏఐ)ని సమర్థవంతంగా ఉపయోగిస్తోంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా మొబైల్, ఆర్థిక మోసాలపై కఠిన చర్యల్లో భాగంగా ప్రభుత్వం దాదాపు 40 లక్షల సిమ్ కార్డులను డీయాక్టివేట్ చేసింది. వీటిని ఏఐ-ఆధారిత సాధనాల గుర్తించారు. టెలికాం కంపెనీలు, ఆర్థిక సంస్థలతో టెలికమ్యూనికేషన్స్ విభాగం(డీఓటీ) భాగస్వామ్యం ద్వారా ఇది సాధ్యమైంది. అధునాతన డిజిటల్ సాధనాలను ఉపయోగించి మోసపూరిత సిమ్‌లను బ్లాక్‌లిస్ట్ చేశారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా అసాధారణ కాలింగ్ లేదా లావాదేవీ కార్యకలాపాల ద్వారా ఎక్కువ రిస్క్ ఉన్న నంబర్లను గుర్తించే ఫైనాన్షియల్ రిస్క్ ఇండికేటర్(ఎఫ్ఆర్ఐ)ను ఉపయోగించారు. ఈ సాధనం ప్రతిరోజూ 2,000 నంబర్లను బ్లాక్ చేస్తుంది. దేశవ్యాప్తంగా నకిలీ లేదా క్లోన్ చేసిన ఆధార్ కార్డు వంటి ప్రూఫ్‌లను ఉపయోగించి అనేక మొబైల్ కనెక్షన్లు ఉన్నాయి. అలాంటి సిమ్ కార్డులు తీసుకుని, స్విమ్ స్వాప్ మోసాలు, ఫిషింగ్ దాడులు, ఓటీపీ చోరీలు, స్కామ్‌లకు వాడుతున్నారు. వీటిని అరికట్టేందుకే డీఓటీ, టెలికాం కంపెనీలు, ఆర్థిక సంస్థలు కలిసి ఏఐ ద్వారా మోసపూరిత నంబర్లను తొలగిస్తున్నాయి.






