- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Realty: రియల్టీ కంపెనీలపై దివాలా ప్రక్రియ సంబంధిత ప్రాజెక్టుకే పరిమితం కావాలి
ఒక ప్రాజెక్ట్ డిఫాల్ట్‌కు గురైతే, మొత్తం కంపెనీకి చెందిన ఇతర ప్రాజెక్టులను ఈ ప్రక్రియలోకి తీసుకురావద్దని పేర్కొంది.

దిశ, బిజినెస్ బ్యూరో: రియల్టీ సంస్థల దివాలా ప్రక్రియకు సంబంధించి నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) కీలక ప్రకటన జారీ చేసింది. రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఇళ్ల కొనుగోలుదారులు చేపట్టే దివాలా ప్రక్రియ ఆ ఒక్క ప్రాజెక్ట్‌కే పరిమితం కావాలని, ఇతర ప్రాజెక్టులకు దాన్ని విస్తరించకూడదని తెలిపింది. ఒక ప్రాజెక్ట్ డిఫాల్ట్‌కు గురైతే, మొత్తం కంపెనీకి చెందిన ఇతర ప్రాజెక్టులను ఈ ప్రక్రియలోకి తీసుకురావద్దని పేర్కొంది. అలా చేయడం సరైంది కాదు. దాని వల్ల, ఇతర ప్రాజెక్టులలో ఇళ్లు కొనుగోలు చేసిన వారు, పెట్టుబడిదారులు అనవసరంగా నష్టపోతారు. కాబట్టి ప్రతి ప్రాజెక్ట్‌ను వేర్వేరుగా చూడాలని స్పష్టం చేసింది. రాహేజా డెవలపర్స్ కేసులో నవీన్ రహేజా దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణ సందర్భంగా ఇద్దరు సభ్యుల ఎన్‌సీఎల్‌ఏటీ ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ (సీఐఆర్‌పీ) ఆయా ప్రాజెక్టుకే పరిమితం చేయాలని వెల్లడించింది.






