- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముచ్చటగా మూడోసారి.. టాటా బోర్డ్ చైర్మన్‌గా మళ్లీ ఎన్.చంద్రశేఖరన్!
టాటా సన్స్ చైర్మన్‌గా ఎన్.చంద్రశేఖరన్ పదవీకాలం పొడిగింపునకు బోర్డు ఆమోదం తెలపనుంది. దీంతో ఆయన 2032 వరకు ఆ పదవిలో కొనసాగే అవకాశం ఉంది.

దిశ, వెబ్‌డెస్క్: టాటా సన్స్ చైర్మన్‌గా ఎన్.చంద్రశేఖరన్ (N. Chandrasekaran) మరో ఐదేళ్లపాటు కొనసాగే అవకాశం ఉంది. ఫిబ్రవరి 24న జరగనున్న టాటా సన్స్ బోర్డు (Tata Sons Board) సమావేశంలో ఆయనకు మూడోసారి బాధ్యతలు అప్పగించే ప్రతిపాదనకు ఆమోదం లభించవచ్చని వార్తలు వస్తున్నాయి. బోర్డు ఆమోదం తెలిపితే.. చంద్రశేఖరన్ 2032 వరకు చైర్మన్‌గా కొనసాగుతారు. ఆయన ప్రస్తుత రెండవ పదవీ కాలం ఫిబ్రవరి 2027తో ముగియనుంది.
టాటా గ్రూప్ నిబంధనల ప్రకారం ఎగ్జిక్యూటివ్ పదవులకు రిటైర్మెంట్ వయస్సు 65 ఏళ్లు మాత్రమే. అయితే, చంద్రశేఖరన్ 2028లో 65 ఏళ్లకు చేరుకుంటారు. కాబట్టి ఆయన కొనసాగింపు కోసం బోర్డు ప్రత్యేక మినహాయింపు ఇవ్వనుంది. మెజారిటీ వాటాదారు అయిన టాటా ట్రస్ట్స్, ముఖ్యంగా చైర్మన్ నోయెల్ టాటా, చంద్రశేఖరన్ నాయకత్వం పట్ల పూర్తి విశ్వాసంతో ఉన్నట్లుగా సమాచారం. సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు (EV), ఎయిరిండియా పునరుద్ధరణ కోసం టాటా గ్రూప్ ప్రణాళిక చేసిన 120 బిలియన్ల డాలర్ల పెట్టుబడులను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఆయన లీడర్‌షిప్ అవసరమని బోర్డు భావిస్తోంది.






