- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Narayana Murthy: మరోసారి ఇన్ఫో నారాయణ నోట.. 72 గంటల పని మాట
జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. చైనాలో అనుసరించే '9-9-6 రూల్' ని ప్రస్తావించారు.

దిశ, బిజినెస్ బ్యూరో: ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ ఆర్ నారాయణ మూర్తి మరోసారి 72 గంటల పని విధానంపై మాట్లాడారు. అయితే, ఈసారి చైనాను ఉదాహరణగా పేర్కొనడంపై వివాదం పెరుగుతోంది. సోమవారం జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. చైనాలో అనుసరించే '9-9-6 రూల్' ని ప్రస్తావించారు. 'వర్క్-లైఫ్ బ్యాలెన్స్ గురించి ఆందోళన చెందే ముందు, ప్రజలు మొదట తమ జీవితాన్ని ఆస్వాదించడంపై దృష్టి పెట్టాలి. తన అనుభవంలో విజయానికి దోహదపడేది కష్టపడి పనిచేయడమేనని, అలా కాకుండా ఏ వ్యక్తి, సమాజం, ఏ దేశం కూడా ముందుకెళ్లలేదు.
గతేడాది తమ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీకి చెందిన సీనియర్ అధికారులు చైనాకు వెళ్లారు. సాధారణ చైనా ప్రజల జీవితాన్ని దగ్గరగా చూసేందుకు వారు చిన్న పట్టణంలోని హోటల్‌లో బస చేశారు. అక్కడొక సామెత ఉంది. 9-9-6 అని చెబుతారు. దీనర్థం.. ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు, వారానికి 6 రోజులు అంటే వారానికి 72 గంటలు పనిచేస్తారట అని నారాయణ మూర్తి వివరించారు. మనదేశ ప్రధాని నరేంద్ర మోడీ వారానికి 100 గంటలు పనిచేస్తారు. ఇతరులకు అవకాశాలు అందించేందుకు, కష్టపడి-తెలివిగా పనిచేసేందుకు ఇదొక ఉదాహరణ అని పేర్కొన్నారు. అయితే, ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో మరోసారి తీవ్రమైన చర్చ జరుగుతోంది. నారయాణ మూర్తి వ్యాఖ్యలు విమర్శిస్తూ చాలామంది పోస్టులు పెడుతున్నారు. దేశంలోని చాలామంది తక్కువ మౌలిక సదుపాయాలు, ఎక్కువ ఖర్చులతో జీవితున్నారని ఒకరు స్పందించారు. మరొకరు, చైనా స్థాయిలో జీతాలు, మౌలిక సదుపాయాలు, జీవన వ్యయం ఇచ్చిన తర్వాత పని గంటలపై మాట్లాడాలని అన్నారు.






