Tata Chemicals: టాటా కెమికల్స్ చైర్మన్, డైరెక్టర్ పదవి నుంచి వైదొలగిన ఎన్ చంద్రశేఖరన్

by S Gopi |

ఈ నిర్ణయం మే 29 నుంచి అమలులోకి వస్తుంది.

Tata Chemicals: టాటా కెమికల్స్ చైర్మన్, డైరెక్టర్ పదవి నుంచి వైదొలగిన ఎన్ చంద్రశేఖరన్
X

దిశ, బిజినెస్ బ్యూరో: టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ గ్రూప్ యాజమాన్యంలోని టాటా కెమికల్స్ చైర్మన్, డైరెక్టర్ పదవి నుంచి వైదొలగనున్నారు. ఈ మేరకు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. దీనికి సంబంధించి కంపెనీ బోర్డుకు రాసిన లేఖలో ఎన్ చంద్రశేఖరన్.. 'టాటా కెమికల్స్ లిమిటెడ్ డైరెక్టర్, బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్ పదవి నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నాను. ఈ నిర్ణయం మే 29 నుంచి అమలులోకి వస్తుంది. ప్రస్తుత, భవిష్యత్తు వ్యాపారాల నిర్వహణను దృష్టిలో ఉంచుకుని బోర్డు నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాను. టాటా కెమికల్స్ బోర్డుకు అధ్యక్షత వహించడం గౌరవంగా భావిస్తున్నాను. ఇందుకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నట్టు' ఆయన లేఖలో పేర్కొన్నారు. ఇదే సమయంలో బుధవారం జరిగిన కంపెనీ సమావేశంలో డైరెక్టర్ల బోర్డు చంద్రశేఖరన్ పదవీ విరమణ నిర్ణయాన్ని అధికారికంగా అంగీకారం తెలిపింది. అనంతరం సంస్థ బోర్డుకు కొత్త ఛైర్మన్‌గా ఎస్ పద్మనాభన్‌ను నియమించారు. ఆయన మే 30 తేదీ నుంచి టాటా కెమికల్స్ డైరెక్టర్, బోర్డు కొత్త ఛైర్మన్‌గా బాధ్యతలు తీసుకుంటారని కంపెనీ వెల్లడించింది. ఇక, నాన్-ఎగ్జిక్యూటివ్, నాన్-ఇండిపెండెంట్ కింద మోదన్ సాహాను అదనపు డైరెక్టర్‌గా నియమించడానికి బోర్డు ఆమోదం తెలిపింది. ఆయన నియామకం మే 28 నుంచి అమల్లోకి వస్తుంది.

Next Story