- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Myntra: డిమాండ్ తీర్చేందుకు మింత్రా 20,000కు పైగా గిగ్ ఉద్యోగాలు
మింత్రా 22వ ఎండ్ ఆఫ్ రీజన్ సేల్ సందర్భంగా డెలివరీ సేవలకు అధిక డిమాండ్ ఉంటుందని కంపెనీ వెల్లడించింది.

దిశ, బిజినెస్ బ్యూరో: పెరిగిన డిమాండ్ కారణంగా దేశవ్యాప్తంగా 20,000 కంటే ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పించినట్టు ప్రముఖ ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ మింత్రా శుక్రవారం ప్రకటనలో తెలిపింది. ఈ నెల 31వ తేదీ నుంచి ప్రారంభం కానున్న మింత్రా 22వ ఎండ్ ఆఫ్ రీజన్ సేల్ సందర్భంగా డెలివరీ సేవలకు అధిక డిమాండ్ ఉంటుందని, దీన్ని తీర్చేందుకు కొత్త నియామకాలు ఉపయోగపడతాయని కంపెనీ వెల్లడించింది. ఈ నియామకలు లాజిస్టిక్స్, కస్టమర్ సర్వీస్, లాస్ట్-మైల్ డెలివరీ కార్యకలాపాల విభాగాల్లో జరిగాయి. కీలక సేల్ సందర్భంగా ఏర్పడే అనూహ్య డిమాండ్ సమయంలో కస్టమర్లకు సులభంగా, అవాంతరాలు లేకుండా డెలివరీ సేవలను అందించగలమని కంపెనీ వివరించింది. మొత్తం నియామకాల్లో దాదాపు 4,500 డెలివరీ పార్ట్‌నర్స్, 1,000 కస్టమర్ సర్వీస్ ఏజెంట్లు ఉన్నారు. కొత్త వేర్‌హౌస్‌లలోని ఉద్యోగుల్లో దాదాపు 22 శాతం మంది మహిళలు ఉన్నారని, బెంగళూరు, ముంబై, కోల్‌కతా, ఢిల్లీలోని ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రాలలో సార్టింగ్, గ్రేడింగ్, ప్యాకింగ్ వంటి పనులకు మహిళలనే ఎక్కువగా నియమించినట్టు కంపెనీ స్పష్టం చేసింది. కస్టమర్లకు అందించే సేవలకు ప్రాధాన్యత కల్పించే లక్ష్యంతోనే 20 వేలకు పైగా నియామకాలు చేపట్టామని, ఇదే సమయంలో తమ డెలివరీ ఏజెంట్లకు ఆదాయాన్ని పెంచే అవకాశాలను అందించడం పట్ల సంతోషంగా ఉన్నామని మింత్రా సీహెచ్ఆర్ఓ గోవింద్‌రాజ్ ఎం కె పేర్కొన్నారు.






