- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Starlink: దేశంలో స్టార్‌లింక్ సేవలకు లభించిన తుది అనుమతులు
గత నెలలోనే కంపెనీ భారత టెలికాం మంత్రిత్వ శాఖ నుంచి కీలకమైన లైసెన్స్‌ను అందుకున్న సంగతి తెలిసిందే.

దిశ, బిజినెస్ బ్యూరో: భారత మార్కెట్లో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించడానికి ప్రపంచ బిలీయనీర్ ఎలన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ భారత అంతరిక్ష నియంత్రణ సంస్థ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ నుంచి లైసెన్స్ పొందింది. దీనితో ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలందించేందుకు మిగిలి ఉన్న ఏకైక నియంత్రణ అనుమతులు కూడా స్టార్‌లింక్‌కు వచ్చేశాయి. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. గత నెలలోనే కంపెనీ భారత టెలికాం మంత్రిత్వ శాఖ నుంచి కీలకమైన లైసెన్స్‌ను అందుకున్న సంగతి తెలిసిందే. ఈ లైసెన్స్ పొందిన మూడో కంపెనీగా స్టార్ లింక్ నిలిచింది. ఇదివరకే యులెల్సాట్ వన్‌వెబ్, రిలయన్స్ జియో ఈ లైసెన్సును అందుకున్నాయి. ఇక, స్టార్‌లింక్ కంపెనీ ప్రభుత్వం నుంచి స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేయాల్సి ఉంది. దేశంలో గ్రౌండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఏర్పాటు చేయాలి. టెస్టింగ్, ట్రయల్స్ ద్వారా స్టార్‌లింక్ ఒప్పుకున్న భద్రతా నియామకాలకు అనుగుణంగా ఉందని నిరూపించుకోవాల్సి ఉంది. ఎలన్ మస్క్, దేశీయ బిలియనీర్ ముఖేష్ అంబానీకి చెందిన జియో మధ్య ఉపగ్రహ ఇంటర్నెట్ సేవల విషయంలో స్పెక్ట్రమ్‌ను ఎలా మంజూరు చేయాలనే దానిపై నెలల తరబడి ఘర్షణ నెలకొన్న సంగతి తెలిసిందే. స్పెక్ట్రమ్‌ను వేలం వేయకుండా, కేటాయించాలి అని స్టార్‌లింక్ కోరగా, వేలం ద్వారానే ప్రక్రియ జరగాలని జియో వాదించింది. అయితే, ఈ విషయంలో భారత ప్రభుత్వం స్పెక్ట్రమ్‌ను కేటాయించేందుకే నిర్ణయం తీసుకుంది.






