Motorola: కొత్త ప్రీమియం 'సిగ్నేచర్' స్మార్ట్‌ఫోన్ విడుదల చేసిన మోటరోలా

by S Gopi |

ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్8 ప్రాసెసర్‌తో పనిచేయనున్న ఈ ప్రీమియం ఫోన్ ఐపీ69, ఐపీ 60 రేటింగ్ ద్వారా డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్‌తో లభిస్తుంది.

Motorola: కొత్త ప్రీమియం సిగ్నేచర్ స్మార్ట్‌ఫోన్ విడుదల చేసిన మోటరోలా
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ మొబైల్‌ఫోన్ తయారీ కంపెనీ మోటోరోలా భారత మార్కెట్లో శుక్రవారం మరో కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. 'సిగ్నేచర్ ' పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16తో 6.8 అంగుళాల సూపర్ హెచ్‌డీ ఎల్‌టీపీఓ ఎక్స్‌ట్రీమ్ అమోల్‌డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్8 ప్రాసెసర్‌తో పనిచేయనున్న ఈ ప్రీమియం ఫోన్ ఐపీ69, ఐపీ 60 రేటింగ్ ద్వారా డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్‌తో లభిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ 5,200ఎంఏహెచ్ సిలికాన్ కార్బన్ బ్యాటరీ, 90వాట్స్ వైర్డ్, 50వాట్స్ వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ 41 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ట్రిపుల్ కెమెరా అమర్చిన ఈ స్మార్ట్‌ఫోన్ 50ఎంపీతో మూడు కెమెరాలను అమర్చారు. ముందువైపు 50ఎంపీ కెమెరా ఉంటుంది. ఈ నెల 30 నుంచి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు మొదలవుతాయని మోటోరోలా పేర్కొంది.

సిగ్నేచర్ ధర

దేశీయ మార్కెట్లో మోటరోలా సిగ్నేచర్ ధర 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ఉన్న బేస్ వేరియంట్ రూ. 59,999కి లభిస్తుంది. 16జీబీ + 512జీబీ వేరియంట్ రూ. 64,999, 16జీబీ ర్యాం, 1టీబీ స్టోరేజ్ ఉన్న టాప్-ఆఫ్-ది-లైన్ వేరియంట్ ధర రూ. 69,999గా నిర్ణయించింది. కస్టమర్‌లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ కార్డులతో రూ. 5,000 తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు లేదా రూ. 5,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను ఎంచుకోవచ్చని కంపెనీ వెల్లడించింది.

Next Story