Motorola: అతిపెద్ద బ్యాటరీతో 'మోటో జీ67 పవర్' స్మార్ట్‌ఫోన్ విడుదల చేసిన మోటోరోలా

by S Gopi |

ఈ సెగ్మెంట్‌లో 50 ఎంపీ కెమెరాతో 4కె వీడియోలను రికార్డ్ చేసే ఫోన్ ఇదొకటేనని పేర్కొంది.

Motorola: అతిపెద్ద బ్యాటరీతో మోటో జీ67 పవర్ స్మార్ట్‌ఫోన్ విడుదల చేసిన మోటోరోలా
X

దిశ, బిజినెస్ బ్యూరో: స్మార్ట్‌ఫోన్ తయారీ బ్రాండ్ మోటరోలా దేశీయంగా తన 'జీ' సిరీస్‌లో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. మోటో జీ67 పవర్‌ పేరుతో తెచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ హై-ఎండ్ ఫీచర్లతో పాటు బడ్జెట్ ధరలో వినియోగదారుల కోసం ప్రీమియం డిజైన్‌, అతిపెద్ద బ్యాటరీ, మెరుగైన కెమెరాలతో జీ67 అందరినీ ఆకట్టుకుంటుందని కంపెనీ తెలిపింది. ఈ సెగ్మెంట్‌లో 50 ఎంపీ కెమెరాతో 4కె వీడియోలను రికార్డ్ చేసే ఫోన్ ఇదొకటేనని పేర్కొంది. 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీప్లస్ డిస్‌ప్లేతో 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో ఈ మొబైల్ లభిస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా పనిచేసే జీ67 పవర్‌లో స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్2 ప్రాసెసర్ అమర్చారు. వెనుక 50ఎంపీ సోనీ లైట్-600 మెయిన్ కెమెరాతో పాటు 8ఎంపీ ఆల్ట్రావైడ్ కెమెరాతో 4కె వీడియో రికార్డ్ చేయవచ్చు. సెల్ఫీ కోసం ముందువైపు 32 ఎంపీ కెమెరా ఉంటుందని కంపెనీ చెబుతోంది. 7000ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చే ఈ ఫోన్ 30వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా, ఏఐ ఫోటో ఎన్‌హాన్స్‌మెంట్ ఇంజిన్, ఆటో నైట్ విజన్, ఏఐ-పవర్డ్ పోర్ట్రెయిట్స్, ఆటో స్మైల్ క్యాప్చర్, హై-రైజ్ జూమ్‌తో సహా మోటరోలా ఏఐ టూల్స్ వంటి కెమెరా ఫీచర్లు లభిస్తాయి. ధరలకు సంబంధించి రెండు వేరియంట్లలో వచ్చే ఈ ఫోన్, 8జీబీ+128జీబీ ధర రూ. 15,999 నిర్ణయించామని, బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ ద్వారా రూ. 14,999కే సొంతం చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఇక, 8జీబీ+256జీబీ వేరియంట్ త్వరలో అందుబాటులోకి వస్తుందని, ధరల వివరాలు వెల్లడిస్తామని మోటోరోలా పేర్కొంది.

Next Story